వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి ఏపీ హైకోర్టులో నిరాశ
వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నిరాశ ఎదురైంది.
By Knakam Karthik
వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి ఏపీ హైకోర్టులో నిరాశ
వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నిరాశ ఎదురైంది. లిక్కర్ స్కామ్ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ దశలో ముందస్తు బెయిల్ ఇవ్వలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. మద్యం ముడుపుల కేసులో ఎంపీ మిథున్ రెడ్డి ఏ4 నిందితుడిగా ఉన్నారు. అయితే మద్యం ఆర్డర్లు, సరఫరా వ్యవస్థ గతంలో ఆన్‌లైన్ పద్ధతి ద్వారా పారదర్శకంగా ఉండేదని, దీనిని మాన్యువల్ విధానంలోకి తీసుకురావడంతో ఎంపీ మిథున్‌రెడ్డి (ఏ4) కీలక పాత్ర పోషించారని సీఐడీ/సిట్ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా హైకోర్టులో వాదనలు వినిపించారు.
ముడుపులు అందిన కంపెనీలకే మద్యం సరఫరా అనుమతులిచ్చారని లూథ్రా తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం వల్ల రాష్ట్ర ఖజానాకు రూ.3,500 కోట్ల నష్టం జరిగిందని అన్నారు. ఆ సొమ్మును మళ్లించడంలో మిథున్‌రెడ్డి ప్రధాన పాత్ర పోషించారని మద్యం కుంభకోణానికి వ్యూహరచన వేసిన నాటి నుంచి దానిని అమలు చేసే వరకు మిథున్‌రెడ్డి కీలకపాత్రధారిగా వ్యవహరించారంటూ సాక్షులు వాంగ్మూలం ఇచ్చినట్లు వాదనలు వినిపించారు. ఇంకా దానికి సంబంధించిన ఆధారాలు లభించాయని వివరించారు. మిథున్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తే ముడుపుల సొమ్ము అంతిమంగా ఎక్కడికి చేరిందో తెలుస్తుందని ధర్మాసనానికి తెలిపారు.