అమెరికాలో కారు ప్రమాదం.. ఆంధ్రా వెటర్నరీ విద్యార్థిని మృతి

ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలికి చెందిన జెట్టి హారిక అనే 25 ఏళ్ల వెటర్నరీ విద్యార్థిని జూలై 20, శనివారం అమెరికాలోని ఓక్లహామా రాష్ట్రంలో జరిగిన కారు ప్రమాదంలో మరణించింది.

By అంజి  Published on  22 July 2024 6:58 AM GMT
Andhrapradesh, veterinary student,  car crash,USA

అమెరికాలో కారు ప్రమాదం.. ఆంధ్రా వెటర్నరీ విద్యార్థిని మృతి

ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలికి చెందిన జెట్టి హారిక అనే 25 ఏళ్ల వెటర్నరీ విద్యార్థిని జూలై 20, శనివారం అమెరికాలోని ఓక్లహామా రాష్ట్రంలో జరిగిన కారు ప్రమాదంలో మరణించింది. వెటర్నరీ మెడిసిన్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేట్ చదువుల కోసం ఏడాదిన్నర క్రితం యూఎస్‌కు వెళ్లిన హారిక, లోగాన్ కౌంటీలోని హైవే 74 సమీపంలో జరిగిన మల్టీ వెహికల్‌ యాక్సిడెంట్‌లో గాయపడిన వారిలో ఒకరు అని ఓక్లహోమా హైవే పెట్రోల్ (OHP)ని ఉటంకిస్తూ Newson6.com రిపోర్ట్‌ చేసింది.

ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా డ్రైవర్ వాహనంపై నియంత్రణ తప్పి మూడు వాహనాలను ఢీకొనడంతో ఒకరు మరణించారని, మరో నలుగురు గాయపడ్డారని ఓహెచ్‌పీ తెలిపింది. ఈ దుర్ఘటన వార్త అటు అమెరికా, ఇటు ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగు ప్రజలను తీవ్రంగా కలచివేసింది. హారిక మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం తెనాలికి తీసుకురావడానికి ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు ప్రభుత్వం నుండి సహాయం కోరుతున్నారు.

హారిక మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు ఆమె తండ్రి జెట్టి శ్రీనివాసరావు, పన్ను శాఖ ఉద్యోగి, తల్లి నాగమణి సహా కుటుంబ సభ్యులు భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదిస్తున్నారు. బంధువు మాట్లాడుతూ, "ఈ ఆకస్మిక ప్రమాదంతో మేము పూర్తిగా హృదయ విదారకంగా ఉన్నాము. హారికను ఇంటికి చేర్చి అంతిమ సంస్కారాలు చేయడమే మా ప్రస్తుత ప్రాధాన్యత. ఈ కష్ట సమయంలో ప్రభుత్వం నుండి మద్దతు, సహకారం అందించాలని మేము అభ్యర్థిస్తున్నాము" అని అన్నారు.

Next Story