ఈ నెల 17 నుంచి టెన్త్‌క్లాస్ ఎగ్జామ్స్..స్ట్రిక్ట్ రూల్స్ అమలు చేయనున్న ఏపీ సర్కార్
ఆంధ్రప్రదేశ్‌లో ఈనెల 17 నుండి ఏప్రిల్ 1 వరకూ 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్ వెల్లడించారు
By Knakam Karthik Published on 13 March 2025 7:30 AM IST
ఈ నెల 17 నుంచి టెన్త్‌క్లాస్ ఎగ్జామ్స్..స్ట్రిక్ట్ రూల్స్ అమలు చేయనున్న ఏపీ సర్కార్
ఆంధ్రప్రదేశ్‌లో ఈనెల 17 నుండి ఏప్రిల్ 1 వరకూ 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్ వెల్లడించారు. ఉ.9.30 గం.ల నుండి మధ్యాహ్నం 12.45గం.ల వరకూ పరీక్షలు జరగనున్నట్లు తెలిపారు. 3వేల 450 పరీక్షా కేంద్రాలలో 6లక్షల 19వేల 275 మంది విద్యార్ధులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. పరీక్ష రోజు పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధిస్తున్నట్లు తెలిపారు. పరీకా కేంద్రాల పరిధిలో జిరాక్సు, నెట్ సెంటర్లను మూసి ఉంచాలని.. ఫేక్ న్యూస్,వదంతులు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని సీఎస్ కే విజయానంద్ సూచించారు. రాష్ట్ర స్థాయిలో 08662974540 నంబర్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చీఫ్ సూపరింటిండెంట్ తప్ప ఎవరి మొబైల్ ఫోన్ పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించొద్దు అని సీఎస్ కే విజయానంద్ ఆదేశించారు.
ఈనెల 17వ తేదీ నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకూ పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఈ పదోతరగతి పబ్లిక్ పరీక్షలలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు...వేసవి దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ జిల్లా కలెక్టర్లు,ఎస్పీలు,విద్యా తదితర శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సీఎస్ విజయానంద్ ఆదేశించారు. పరీకా కేంద్రాల పరిధిలో జిరాక్సు, నెట్ సెంటర్లను మూసి ఉంచాలి అని ఆదేశించారు. ఫేక్ న్యూస్..వదంతులు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని హెచ్చరించారు. చీఫ్ సూపరింటిండెంట్ తప్ప ఎవరి మొబైల్ ఫోన్ పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించొద్దు అని సీఎస్ కే విజయానంద్ ఆదేశించారు.
పరీక్షా కేంద్రాల్లో మెుబైల్‌కు అనుమతి లేదు
పరీక్షా కేంద్రాల్లో మెుబైల్ ఫోన్స్‌కు అనుమతి లేదు అని సీఎస్ కే విజయానంద్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. చీఫ్ సూపరింటిండెంట్ మినహా ఎవరి మొబైల్ ఫోన్‌ను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరాదని స్పష్టం చేశారు. ఎవరైనా మొబైల్ ఫోన్లు తీసుకువస్తే వాటిని పరీక్షా కేంద్రాల ప్రధాన గేటువద్దే వాటిని సేకరించి భద్రపర్చి పరీక్ష అనంతరం వాటిని తిరిగి అప్పగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అలాగే పరీక్షలు జరిగే రోజుల్లో పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ణలు విధించాలని ఆదేశించారు. అలాగే పరీక్షా కేంద్రాల పరిధిలోని జిరాక్సు,నెట్ సెంటర్లన్నీ మూసి ఉంచేలా తగిన చర్యలు తీసుకోవాలని కలక్టర్లను సీఎస్ విజయానంద్ ఆదేశించారు.