ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తన ఫ్యామిలీతో కలిసి పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో పర్యటించారు. సతీమణి నారా బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌తో కలిసి అక్కడకు వెళ్లిన మంత్రి లోకేశ్ గోల్డెన్ టెంపుల్‌ను సందర్శించారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పవిత్రమైన శ్రీ హర్మందిర్ సాహిబ్‌ను సందర్శించుకుని ప్రతి ఒక్కరికీ సుఖశాంతులు కలగాలని కోరుకున్నారు.
అయితే ఈ పర్యటనపై మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా ఫొటోలు షేర్ చేశారు. స్వర్ణ దేవాలయం వద్ద దిగిన ఫొటోలను షేర్ చేశారు. ఈ రోజు అమృత్‌సర్‌లోని పవిత్రమైన హర్మందిర్ సాహిబ్‌ను సందర్శించే అదృష్టం కలిగిందని మంత్రి చెప్పారు. శాంతి, అందరి శ్రేయస్సు కోసం ప్రార్థించానని తెలిపారు. స్వర్ణ దేవాలయం ప్రశాంతతకు స్ఫూర్తిదాయకమన్నారు. వాహెగురు ఆశీస్సులు మార్గనిర్దేశం చేస్తాయని లోకేశ్ పేర్కొన్నారు.