తప్పు చేయాలంటే భయపడేలా చేస్తాం : మంత్రి నారా లోకేశ్
యూనివర్సిటీల్లో తప్పు చేయాలంటేనే భయపడేలా కూటమి ప్రభుత్వ చర్యలు ఉంటాయని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు
By Knakam Karthik Published on 13 March 2025 1:30 PM IST
వర్సిటీల్లో అలా చేయాలంటే భయపడేలా చేస్తాం: మంత్రి నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్‌లోని యూనివర్సిటీల్లో తప్పు చేయాలంటేనే భయపడేలా కూటమి ప్రభుత్వ చర్యలు ఉంటాయని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. గురువారం రాష్ట్ర అసెంబ్లీలో క్వశ్చన్ అవర్‌లో భాగంగా ఆంధ్రా విశ్వవిద్యాలయంలో అక్రమాలపై చర్చ జరిగింది. వైసీపీ హయాంలో అనే అక్రమాలు జరిగాయని టీడీపీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు, జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సభ దృష్టికి తీసుకొచ్చారు.
ఈ అంశంపై మంత్రి లోకేశ్ మాట్లాడుతూ... ఆంధ్రా యూనివర్సిటీలో అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపిస్తామని అన్నారు. ఇన్‌ఛార్జ్ వీసీ ఇప్పటికే విచారణకు ఆదేశించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ విచారణ నివేదిక అందిన వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ.. గతంలో ఏయూ వీసీగా పనిచేసిన ప్రసాదరెడ్డి వైసీపీ అధ్యక్షుడి తరహాలో వ్యవహరించారని మండిపడ్డారు. ఎంతో పేరున్న ఆంధ్రా విశ్వవిద్యాలయాన్ని రాజకీయ వేదికగా ఆయన మార్చేశారని ఆరోపించారు. ఏపీలోని ఇతర వర్సిటీల ప్రక్షాళన కూడా జరగాలని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కోరారు. ఏయూ విషయంలో నిర్దిష్ట కాలంలో విచారణ జరగాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పేర్కొన్నారు.
గత ప్రభుత్వంలో నాటి ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేసిన అవకతవకల పైన కఠిన చర్యలు ఉంటాయి. ఇన్ ఛార్జి వీసీ ఇప్పటికే విచారణకు ఆదేశించారు. ఈ రోజు గౌరవ సభ్యులు అడిగారు కాబట్టి విజిలెన్స్ విచారణ కూడా జరిపిస్తాం. 60 రోజుల్లో విచారణ పూర్తి చేసి, నివేదిక రాగానే కఠిన చర్యలు తీసుకుంటాం.… pic.twitter.com/388KlESNTL
— Telugu Desam Party (@JaiTDP) March 13, 2025