Andhrapradesh: త్వరలోనే మెగా డీఎస్సీ.. ప్లానింగ్ తప్పనిసరి
ఆంధ్రప్రదేశ్‌లో టెట్ పరీక్షలు అక్టోబర్ 21తో పూర్తి కానున్నాయి. నవంబర్ 2న ఫలితాలు విడుదల చేయనున్నారు.
By అంజి Published on 17 Oct 2024 10:19 AM ISTAndhrapradesh: త్వరలోనే మెగా డీఎస్సీ.. ప్లానింగ్ తప్పనిసరి
ఆంధ్రప్రదేశ్‌లో టెట్ పరీక్షలు అక్టోబర్ 21తో పూర్తి కానున్నాయి. నవంబర్ 2న ఫలితాలు విడుదల చేయనున్నారు. నవంబర్ 3న 16,347 పోస్టులకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుంది. డిసెంబర్ 20 నుంచి డీఎస్సీ పరీక్షలు ఉండొచ్చు. కావున డీఎస్సీకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ప్రస్తుతం ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే తప్పనిసరిగా విజయం సాధించవచ్చు. ఇందుకు ప్లానింగ్ తప్పనిసరి.
రోజూ ప్రణాళిక ప్రకారం.. 10 నుంచి 15 గంటలు చదవాలి. చదివిన దానిని రివిజన్ చేస్తుండాలి. ముఖ్యమైన పాయింట్లను షార్ట్ నోట్స్ రాసుకోవాలి. దీని వలన క్విక్ రివిజన్‌కు అవకాశం ఉంటుంది. ప్రతి అంశాన్ని అర్థం చేసుకుని చదవడం ద్వారా ఎలా ప్రశ్న అడిగినా సమాధానాన్ని గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యమంగా ప్రభుత్వ పాఠ్య పుస్తకాలను మాత్రమే చదవాలి. వాటిలో నుంచే ప్రశ్నల వస్తాయి.
కష్టతరమైన సబ్జెక్టును ఉదయం సమయంలో, ఈజీగా ఉన్న సబ్జెక్టును సాయంత్రం చదవాలి. కొన్ని అంశాలు గుర్తుండకపోతే కొండగుర్తులుగానీ, షార్ట్‌కర్ట్స్ గానీ పెట్టుకోవాలి. ఒక్కొక్క సబ్జెక్టును టైమ్ టేబుల్ పెట్టుకుని చదవడం వల్ల వీలైనంత వరకు సిలబస్‌ను పూర్తిగా చదవడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా డీఎస్సీ మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి. ప్రశ్నలు ఎలా వస్తాయి అనేది తెలియడంతో పాటు టైమ్ మేనేజ్‌మెంట్‌కు ఉపయోగపడుతుంది.
మరోవైపు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు డీఎస్సీ ఉచిత శిక్షణ పొందాలంటే జ్ఞానభూమి పోర్టల్‌లో ఈ నెల 21 లోపు దరఖాస్తు చేసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ తెలిపింది. ఈ నెల 27న అభ్యర్థులకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించడం ద్వారా అర్హులను ఎంపిక చేసి శిక్షణ అందించనున్నారు.