Andhrapradesh: వృద్ధులకు గుడ్‌న్యూస్‌.. ఆర్టీసీ బస్సుల్లో 25 శాతం రాయితీ

సీనియర్‌ సిటిజన్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. బస్సుల్లో ప్రయాణించే సీనియర్‌ సిటిజన్లకు 25 శాతం రాయితీ ఇవ్వనున్నట్టు ఏపీఎస్‌ఆర్టీసీ తెలిపింది.

By అంజి  Published on  15 Nov 2024 1:37 AM GMT
Andhrapradesh, discount, APSRTC, bus, senior citizens

Andhrapradesh: వృద్ధులకు గుడ్‌న్యూస్‌.. ఆర్టీసీ బస్సుల్లో 25 శాతం రాయితీ

అమరావతి: సీనియర్‌ సిటిజన్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. బస్సుల్లో ప్రయాణించే సీనియర్‌ సిటిజన్లకు 25 శాతం రాయితీ ఇవ్వనున్నట్టు ఏపీఎస్‌ఆర్టీసీ తెలిపింది. ఏ రాష్ట్రానికి చెందిన వారైనా, ఏ ఆర్టీసీ బస్సులోనైనా ఈ రాయితీతో ప్రయాణించే వీలు ఉంటుంది. సీనియర్‌ సిటిజన్లకు 60 ఏళ్ల వయసు పైబడి ఉండాలి. రాయితీ అమ‌ల‌కు కోసం ఆరు ర‌కాల గుర్తింపు కార్డుల‌ను ప్ర‌క‌టించింది. వీటిలో ఆధార్‌ కార్డ్‌ ,సీనియర్‌ సిటిజన్‌ ఐడీ, పాన్‌ కార్డ్‌, ఓటర్‌ ఐడీ, పాస్‌పోర్ట్‌, రేషన్‌ కార్డుల్లో ఏదైనా చూపించాల్సి ఉంటుంది.

అది ఫిజికల్‌గా లేదా డిజిటల్‌ రూపంలోనైనా చూపించవచ్చని ఏపీఎస్‌ఆర్టీసీ తెలిపింది. సీనియ‌ర్ సిటిజ‌న్స్ త‌మ వ‌య‌స్సుకు సంబంధించిన హార్డ్ కాపీలు లేదంటే సాఫ్ట్‌కాపీల్లో ఏవి చూపించినా వాటిని అనుమ‌తించాల‌ని పేర్కొంది. ఈ మేర‌కు ఏపీఎస్ ఆర్టీసీ అన్ని జోన్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు, అన్ని జిల్లా ప్రజా రవాణా అధికారులు ఆదేశాలు వెళ్లాయి. అర్హత కలిగిన సీనియర్ సిటిజన్లకు వారి నివాస స్థలంతో సంబంధం లేకుండా 25 శాతం రాయితీ అమ‌లు చేయాల‌ని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Next Story