Andhra Pradesh: కారు-కంటైనర్ ఢీకొని ఐదుగురు దుర్మరణం
వైఎస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
By Srikanth Gundamalla
Andhra Pradesh: కారు-కంటైనర్ ఢీకొని ఐదుగురు దుర్మరణం
వైఎస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రామాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని గువ్వల చెరువు ఘాట్‌లో సోమవారం అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగింది. చింతకొమ్మదిన్నె దగ్గర కారు-కంటైనర్ ఢీకొన్నాయి. ఈ గటన ఐదుగురు దుర్మరణం చెందారు. కారులో ఉన్న నలుగురితో పాటు.. కంటైనర్ డ్రైవర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. అయితే.. కారులో నలుగురు బంధువుల అంత్యక్రియలు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం సంభవించింది. మృతులు చక్రాయపేట మండలం కొన్నేపల్లి గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.
ఈ ప్రమాదం తర్వాత స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్నారు పోలీసులు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలాన్ని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును.. ఆ తర్వాత ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని.. దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.విచారణ తర్వాత ప్రమాదానికి గల కారణాలు తెలియజేస్తామన్నారు. ఇక ప్రమాదంలో ఐదుగురు చనిపోవడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.