టీడీపీ, జనసేన ఎన్ని చోట్ల పోటీ చేస్తారో వారికే తెలియదు: కొడాలి నాని

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి

By Srikanth Gundamalla  Published on  22 Feb 2024 10:35 AM GMT
andhra pradesh, ycp, kodali nani,  tdp, janasena,

టీడీపీ, జనసేన ఎన్ని చోట్ల పోటీ చేస్తారో వారికే తెలియదు: కొడాలి నాని

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు పెరుగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని టీడీపీ, జనసేన కలిసి బరిలోకి దిగుతున్నాయి. ఇక బీజేపీని కూడా కలుపుకొని పోయే పనిలో పడ్డారు. మరోవైపు వైసీపీ తన అధికారాన్ని నిలుపుకొనేందుకు అన్ని ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వరుస ప్రెస్‌మీట్లు, సభలు, సమావేశాలు పెట్టి ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా మాజీమంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని టీడీపీ, జనసేన పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.

కృష్నా జిల్లా గుడివాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి కొడాలి నాని టీడీపీ, జనసేన, బీజేపీలపై విమర్శలు చేశారు. ఈ మూడు పార్టీలకు రాష్ట్రంలో ఎక్కడ యుద్ధం చేస్తారో వారికే తెలియనది సెటైర్లు వేశారు. అసలు కలిసి యుద్ధం చేస్తారో లేదో కూడా తెలియదని అన్నారు. పవన్ కళ్యాణ్‌, చంద్రబాబుకే ఈ విషయం తెలియదంటూ ఎద్దేవా చేశారు. అయితే.. రాష్ట్రంలో ఉన్న అన్ని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు వైసీపీ సిద్ధంగా ఉందని చెప్పారు. అలా టీడీపీ, జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారో చెప్పలగలరా అని మాజీ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు.

ఇక బీజేపీతో కలిసి ఈ సారి యుద్ధానికి దిగుతారా లేదా అన్ని టీడీపీ, జనసేనలో క్లారిటీ లేదన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. మూడు పార్టీలు కలిసి ఎన్ని చోట్ల యుద్ధం చేస్తారో ముందు తేల్చుకుని.. ఆ తర్వాత ప్రచారంలోకి దిగాలన్నారు. సీట్ల పంపకాలు తేలిన తర్వాతే సిద్ధం బ్యానర్ల పక్కన.. మీ యుద్ధం బ్యానర్లు పెట్టుకోండంటూ కొడాలి నాని సూచించారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిస్తే తొలి ఆరు నెలల్లోనే రోడ్లన్నీ వేస్తామని కొడాలి నాని హామీ ఇచ్చారు. అంతేకాదు.. వైసీపీ ప్రవేశపెట్టబోయే మేనిఫెస్టోలో రోడ్ల అంశంపై కీలక ప్రకటన చేయబోతున్నట్లు చెప్పారు. చంద్రబాబు హయాంలో ఉన్న పెండింగ్‌ బిల్లులను క్లియర్ చేయడానికే రెండేళ్లు పట్టిందనీ.. తర్వాత కరోనా రావడం వల్ల కొన్ని పనులు ఆగిపోయాయని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు.

Next Story