వైసీపీ కేడర్ అప్పుడే యాక్టివేట్ అయిందా?

ఎన్నికలు అయిపోయాక.. ఘోర ఓటమిలో నుండి వైసీపీ బయటకు రావడానికి చాలా కాలమే పడుతుందని అందరూ అనుకున్నారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 July 2024 9:30 PM IST
Andhra Pradesh, ycp cadre,  political,

వైసీపీ కేడర్ అప్పుడే యాక్టివేట్ అయిందా? 

ఎన్నికలు అయిపోయాక.. ఘోర ఓటమిలో నుండి వైసీపీ బయటకు రావడానికి చాలా కాలమే పడుతుందని అందరూ అనుకున్నారు. గత ఎన్నికల్లో శాసించే స్థాయికి చేరిన వైసీపీ సంఖ్యా బలం.. ఈ ఎన్నికల్లో పాతాళానికి పడిపోవడం ఊహించని షాక్. తేరుకోడానికి ఓ రెండేళ్లయినా పడుతుందని అనుకున్నారు. కానీ గత కొద్దిరోజులుగా ఏపీలో జరుగుతున్న ఘటనలకు సంబంధించి కేడర్ మళ్లీ యాక్టివేట్ అయినట్లు తెలుస్తోంది. వైసీపీ ఓటమికి.. టీడీపీ గెలుపుకి కేవలం తక్కువ శాతం తేడా ఉందని భావించిన వైసీపీ కేడర్ తమను తాము డిఫెండ్ చేసుకునే పనిలో కలిసికట్టుగా పని చేయడం మొదలుపెట్టాయి.

దీనికి ఓ వైపు టీడీపీ చేస్తున్న దాడులు కూడా కారణం అవ్వొచ్చు. గ్రామస్థాయిలో ఉన్న వైసీపీ కార్యకర్తలు కూడా అవ్వొచ్చు. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన హామీలను నెరవేరుస్తారో లేదో అనే అనుమానాలు ఓ వైపు ప్రజల్లో ఉండగా.. తల్లికి వందనం విషయంలో వైసీపీ టీడీపీ మీద తీవ్ర ఒత్తిడి తీసుకుని వచ్చింది. వినుకొండలో హత్యకు గురైన జిలానీ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన వైఎస్ జగన్ కూడా కూటమి ఇచ్చిన హామీలపై కౌంటర్లు వేయడం మొదలుపెట్టారు. ఆచరణకు వీలవుతుందా లేదా అని చూడకుండా చంద్రబాబు హామీలను గుప్పించారంటూ వైఎస్ జగన్ సెటైర్లు వేశారు. ఇక వైఎస్ జగన్ వెళుతున్న ప్రాంతాలకు కార్యకర్తలు కూడా బాగానే వస్తున్నారు. అసలు వైసీపీనే లేకుండా చేయాలని ఓ వైపు టీడీపీ ప్రయత్నాలు చేస్తుందని అనుకుంటూ ఉండగా.. కొన్ని ఘటనల వలన వైసీపీ క్యాడర్ అలర్ట్ అయిపోయిందనే విషయాన్ని టీడీపీ కూడా గుర్తు పెట్టుకోవాలి.

Next Story