ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫ‌లితాలు.. విజేతలు వీరే

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి హవా కొనసాగుతోంది.

By Srikanth Gundamalla  Published on  4 Jun 2024 11:59 AM IST
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫ‌లితాలు.. విజేతలు వీరే

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి హవా కొనసాగుతోంది. అధిక స్థానాల్లో టీడీపీ ముందంజలో ఉంది. ఇక జనసేన కూడా ఆయా స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది. అధికార పార్టీ వైసీపీకి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు షాక్‌ ఇచ్చారు. మరోసారి అధికారంలోకి వైసీపీ వస్తుందని అంచనా వేసిన ఎగ్జిట్‌ పోల్స్‌ను తాజాగా వెల్లడవుతున్న ఫలితాలు తారుమారు చేస్తున్నాయి. ఇప్పటికే మెజార్టీ స్థానాల్లో టీడీపీ లీడింగ్‌లో కొనసాగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ఉంచిన వివరాల ప్రకారం.. టీడీపీ 130 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక టీడీపీ మిత్రపక్షం జనసేన 20 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. వైసీపీ మాత్రం 18 స్థానాలకు పడిపోయింది. బీజేపీ 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

ఇక ఏపీలో తొలి ఫలితం వచ్చేసింది. టీడీపీ మొదటి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. రాజమండ్రి రూరల్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయాన్ని సాధించారు. సమీప వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణపై భారీ విజయాన్ని అందుకున్నారు. దాదాపు 50వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయాన్ని సాధించారు. మరోవైపు టీడీపీ ఎక్కువ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండటంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం మొదలైంది. ఇప్పటికే టీడీపీ పార్టీ ఆఫీసులతో పాటు.. ఆ పార్టీ చీఫ్‌ చంద్రబాబు నివాసం వద్ద సందడి వాతావరణం కనిపిస్తోంది. పార్టీ శ్రేణులు, అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

* టీడీపీ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి వాసు 55 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్‌రామ్‌పై ఆయన విజయం సాధించారు.


Live Updates

  • 4 Jun 2024 2:57 PM IST

    టీడీపీ డోన్‌ ఎమ్మెల్యే అభ్యర్థి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి 6,450 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిపై ఆయన విజయం సాధించారు

  • 4 Jun 2024 2:38 PM IST

    కమలాపురంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పుత్తా చైతన్య రెడ్డి విజయం సాధించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మామ అయిన వైఎస్సార్సీపీ అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డిపై ఆయన విజయం సాధించారు.

  • 4 Jun 2024 2:19 PM IST

    ఉండి అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా టీడీపీ అభ్య‌ర్ధి రఘురామకృష్ణంరాజు 56,421 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజుపై ఆయన విజయం సాధించారు.

  • 4 Jun 2024 2:09 PM IST

    మైలవరం టీడీపీ అభ్యర్థి వసంతకృష్ణ ప్రసాద్‌ 27 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఎస్ తిరుపతిరావు యాదవ్‌పై ఆయ‌న‌ విజయం సాధించారు.

  • 4 Jun 2024 2:07 PM IST

    మైదుకూరు ఎమ్మెల్యేగా 20,937 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన టీడీపీ అభ్య‌ర్ధి పుట్టా సుధాకర్ యాదవ్

  • 4 Jun 2024 1:50 PM IST

    ఉరకొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్య‌ర్ధి పయ్యావుల కేశవ్ 20,804 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

  • 4 Jun 2024 1:45 PM IST

    చింతలపూడిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రోషన్ కుమార్ 26,972 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

  • 4 Jun 2024 1:41 PM IST

    నిమ్మల రామానాయుడు 63,463 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆయన మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

  • 4 Jun 2024 1:38 PM IST

    రాజానగరంలో జనసేన అభ్య‌ర్తి బలరామకృష్ణ 33,674 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి జక్కంపూడి రాజాపై ఆయన విజయం సాధించారు.

  • 4 Jun 2024 1:36 PM IST

    జనసేన తొలి విజయం సాధించింది. భీమ‌వ‌రం నుంచి రామాంజనేయులు పులపర్తి (అంజిబాబు) 64,37 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్‌పై ఆయన విజయం సాధించారు.

Next Story