ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫ‌లితాలు.. విజేతలు వీరే

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి హవా కొనసాగుతోంది.

By Srikanth Gundamalla  Published on  4 Jun 2024 11:59 AM IST
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫ‌లితాలు.. విజేతలు వీరే

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి హవా కొనసాగుతోంది. అధిక స్థానాల్లో టీడీపీ ముందంజలో ఉంది. ఇక జనసేన కూడా ఆయా స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది. అధికార పార్టీ వైసీపీకి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు షాక్‌ ఇచ్చారు. మరోసారి అధికారంలోకి వైసీపీ వస్తుందని అంచనా వేసిన ఎగ్జిట్‌ పోల్స్‌ను తాజాగా వెల్లడవుతున్న ఫలితాలు తారుమారు చేస్తున్నాయి. ఇప్పటికే మెజార్టీ స్థానాల్లో టీడీపీ లీడింగ్‌లో కొనసాగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ఉంచిన వివరాల ప్రకారం.. టీడీపీ 130 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక టీడీపీ మిత్రపక్షం జనసేన 20 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. వైసీపీ మాత్రం 18 స్థానాలకు పడిపోయింది. బీజేపీ 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

ఇక ఏపీలో తొలి ఫలితం వచ్చేసింది. టీడీపీ మొదటి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. రాజమండ్రి రూరల్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయాన్ని సాధించారు. సమీప వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణపై భారీ విజయాన్ని అందుకున్నారు. దాదాపు 50వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయాన్ని సాధించారు. మరోవైపు టీడీపీ ఎక్కువ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండటంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం మొదలైంది. ఇప్పటికే టీడీపీ పార్టీ ఆఫీసులతో పాటు.. ఆ పార్టీ చీఫ్‌ చంద్రబాబు నివాసం వద్ద సందడి వాతావరణం కనిపిస్తోంది. పార్టీ శ్రేణులు, అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

* టీడీపీ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి వాసు 55 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్‌రామ్‌పై ఆయన విజయం సాధించారు.


Live Updates

  • 4 Jun 2024 12:57 PM IST

    అనపర్తి ఎమ్మెల్యేగా బీజేపీ అభ్య‌ర్ధి రామకృష్ణారెడ్డి విజయం సాధించారు. టీడీపీ టికెట్ నిరాకరించడంతో రామకృష్ణారెడ్డి బీజేపీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేశారు.

  • 4 Jun 2024 12:28 PM IST

    టీడీపీ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి వాసు 55 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. రాజమండ్రి ఎంపీ అభ్యర్థి మార్గాని భరత్‌రామ్‌పై ఆయన విజయం సాధించారు.

  • 4 Jun 2024 12:23 PM IST

    టీడీపీ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి బుచ్చయ్య చౌదరి 50 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. టీడీపీ నుంచి గెలిచిన తొలి అభ్యర్థి ఆయనే కావ‌డం విశేషం.

Next Story