ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే చల్లని పాలన మొదలవ్వాలి: చంద్రబాబు
తెలుగు ప్రజలందరికీ టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఉగాది పండగ శుభాకాంక్షలు తెలిపారు.
By Srikanth Gundamalla Published on 9 April 2024 5:05 AM GMTప్రజల ఆకాంక్షలను నెరవేర్చే చల్లని పాలన మొదలవ్వాలి: చంద్రబాబు
తెలుగు ప్రజలందరికీ టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఉగాది పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఒక పోస్టు పెట్టారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయం వచ్చేసిందని గుర్తు చేశారు చంద్రబాబు. ఈ సమయంలో మనందరం క్రోధి నామ తెలుగు సంవత్సరం అడుగు పెడుతున్నట్లు తెలిపారు. క్రోధి అంటే కోపంతో ఉన్నవారు అర్థం అని వివరించారు. ఇవాళ్టి ప్రజల ఆగ్రహం.. ధర్మాగ్రహం కావాలంటూ పిలుపునిచ్చారు. ఆ ఆగరహంపై చెడు అంతా దహనమై.. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే చల్లని ప్రభుత్వం రావాలని కోరుకుందాం అంటూ చంద్రబాబు ఎక్స్‌లో రాసుకొచ్చారు. అలాగే.. ఈ ఉగాది అందరికీ ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, అభివృద్ధిని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పారు.
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు! ఈ ఎన్నికల సమయంలో మనందరం క్రోధి నామ తెలుగు సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. క్రోధి అంటే కోపంతో ఉన్నవారు అని అర్థం. అయితే నేడు మీ ఆగ్రహం...ధర్మాగ్రహం కావాలి. ఆ ఆగ్రహంలో చెడు అంతా…
— N Chandrababu Naidu (@ncbn) April 8, 2024
మరోవైపు ఏపీ ప్రజలందరికీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు, అవ్వాతాతలు, విద్యార్థులు అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాని సీఎం జగన్ కూడా ఎక్స్ వేదికగా ఒక పోస్టు పెట్టారు.
రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో నా అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు, అవ్వాతాతలు, విద్యార్థులు అందరికీ మంచి జరిగి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను.
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 9, 2024
ఇక క్రోధి నా సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. నవ వసంతం అందరికీ ఆయురారోగ్యాలు, సకల శుభాలు చేకూర్చాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఉగాది తెచ్చే ఉత్తేజంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతికి, ప్రజా సంక్షేమాని పాటుపడదామని ఎక్స్‌లో నారా లోకేశ్ పేర్కొన్నారు.