ఏపీలో రోడ్డు ప్రమాదం, ముగ్గురు దుర్మరణం
ఆంధ్రప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం సంభవించింది.
By Srikanth Gundamalla Published on 21 Aug 2024 8:15 AM ISTఏపీలో రోడ్డు ప్రమాదం, ముగ్గురు దుర్మరణం
ఆంధ్రప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం సంభవించింది. అనంతపురం జిల్లా తాడిపత్రం మండల పరిధిలో లారీ, కారు ఒకదానిని మరోటి ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
కాగా..ఈ రోడ్డుప్రమాదం బొందలదిన్నె గ్రామం దగ్గర సంభవించింది. తాడిపత్రి మండలం గంధారగుట్టపల్లికి గ్రామానికి చెందిన ముగ్గురు కారులో ప్రయాణిస్తున్నారు. లారీ, కారు ఎదురెదురుగా ఢీకొనడం వల్ల కారులో ఉన్న ముగ్గురు చనిపోయారు. మృతులను ప్రతాప్‌రెడ్డి, ప్రమీల, వెంకటలక్ష్మిలుగా పోలీసులు గుర్తించారు. అయితే.. శుభకార్యం కోసం కడప జిల్లా వేంపల్లికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. మంగళవారం రాత్రి ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే ఇద్దు స్పాట్‌లోనే చనిపోగా.. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. కానీ, మార్గం మధ్యలోనే ఆమె మృతిచెందింది.
స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరి మృతదేహాలను కారులో నుంచి బయటకు తీశారు. ఆ తర్వాత మొత్తం ముగ్గురి డెడ్‌బాడీస్‌ను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశామనీ.. దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.