అమరావతి: సత్వర న్యాయం, పటిష్టమైన పోలీసింగ్ లో దేశంలోనే రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ప్రజలకు న్యాయ సహాయం, శాంతిభద్రతల్లో ఏపీ టాప్‌లో ఉందని ఇండియా జస్టిస్ రిపోర్టు 2025 వెల్లడించింది. 2019 నుంచి 2024 వరకు ఈ అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ర్యాంకింగ్ పడిపోయినట్లు నివేదిక పేర్కొంది. కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో చట్టబద్ద పాలన తిరిగి వచ్చినట్టు ఇండియా జస్టిస్ రిపోర్టు వెల్లడించింది. పోలీసింగ్‌తో పాటు న్యాయ సహకారాన్ని అందించటంలో ఏపీ పనితీరు మెరుగైనట్టు ఇండియా జస్టిస్ రిపోర్టు 2025 స్పష్టం చేసింది.
రాష్ట్రంలో శాంతిభద్రతలు, పోలీసింగ్, న్యాయవ్యవస్థ పనితీరు, సామాజిక, చట్టపరమైన పాలన తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఏపికి ర్యాంకింగ్ ఇచ్చినట్లు ఆ నివేదిక తెలిపింది. ఇండియా జస్టిస్ రిపోర్టు లో 6.78 స్కోర్ తో మొదటిస్థానంలో కర్ణాటక నిలవగా, 6.32 స్కోర్ తో రెండో స్థానంలో ఏపీ నిలిచింది. తదుపరి స్థానాల్లో తెలంగాణా, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి.