పెన్షన్ల పంపిణీపై సీఎం చంద్రబాబు కీలక కామెంట్స్

ఏపీలో సెప్టెంబర్‌ నెలకు సంబంధించిన పెన్షన్లను ఒక రోజు ముందుగానే ప్రారంభించింది ప్రభుత్వం.

By Srikanth Gundamalla  Published on  31 Aug 2024 6:20 AM GMT
పెన్షన్ల పంపిణీపై సీఎం చంద్రబాబు కీలక కామెంట్స్

ఏపీలో సెప్టెంబర్‌ నెలకు సంబంధించిన పెన్షన్లను ఒక రోజు ముందుగానే ప్రారంభించింది ప్రభుత్వం. అయితే.. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో పెన్షన్ల పంపిణీకి అంతరాయం కలుగుతోంది. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంపై కీలక కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపత్యంలో సచివాలయ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు వెసులుబాటు కల్పించారు. ఆయా ప్రాంతాల్లో ఇబ్బందులు ఉంటే సెప్టెంబర్ ఒకటి, రెండు రోజులు పాటు పెన్షన్ల పంపిణీ పూర్తి చేయవచ్చని చెప్పారు. ఈ విసయంలో సచివాలయ ఉద్యోగులపై ఎవరూ ఒత్తిడి తీసుకురావొద్దని సూచించారు. టార్గెట్‌ పెట్టొద్దంటూ కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. వర్షాలు లేని ప్రాంతాల్లో యథావిధిగా పెన్షన్లు పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు చెప్పారు.

అక్టోబర్‌ 2 నుంచి అర్హులైన వారికి కొత్త పెన్షన్లు ఇస్తామని ఇప్పటికే స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. అనర్హుల పెన్షన్లు తొలగించాలని యోచిస్తున్నట్లు చెప్పారు. ఏపీలో పెన్షన్ల పంపిణీ వేగంగా కొనసాగుతోందన్నారు. ఉదయం నుంచే పెన్షన్ డబ్బులను లబ్ధిదారులకు సచివాలయ సిబ్బంది అందజేస్తున్నారని చెప్పారు. భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాలు మినహా ఇతర చోట్ల పంపిణీ చేపడుతున్నారు. సెప్టెంబర్ ఒకటో తేదీన సెలవు కావడంతో ఒక రోజు ముందుగానే ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన విషయం తెలిసిందే.

Next Story