ఏపీలో పెన్షన్ల పండుగ, పాల్గొన్న సీఎం.. వారికి నెలకు రూ.15వేలు

ఏపీలో పెన్షన్ల పండుగ మొదలైంది. ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం పెంచిన పెన్షన్లను పంపిణీ చేస్తోంది.

By Srikanth Gundamalla  Published on  1 July 2024 1:15 AM GMT
andhra pradesh pension cm chandrababu

ఏపీలో పెన్షన్ల పండుగ, పాల్గొన్న సీఎం.. వారికి నెలకు రూ.15వేలు

ఏపీలో పెన్షన్ల పండుగ మొదలైంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం పెంచిన పెన్షన్లను పంపిణీ చేస్తోంది. ఎన్టీఆర్ భరోసా పేరుతో ఏప్రిల్ నెల నుంచే అమలు చేస్తూ.. మూడు నెలల బకాయిలు కూడా కలిపి ఇస్తోంది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో మండలం పెనుమాకలో సీఎం చంద్రబాబు పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. ఓ రాష్ట్ర సీఎం స్వయంగా ఇలా పింఛన్లు పంపీణీ చేయడం దేశ చరిత్రలోనే తొలిసారి అంటున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా 65.31 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు. రూ.4408 కోట్లు ఇందు కోసం అవసరం పడుతున్నాఇ.

వృద్దులు, వితంతువులు, ఒంటరి మహిళలు, మత్స్య కారులు, చేనేత, కల్లుగీత కార్మికులు, కళాకారులు, డప్పు కళాకారులు, ట్రాన్స్ జెండర్స్‌కు గతంలో నెలకు రూ.3వేలు ఉంటే.. ఇప్పుడు రూ.4వేకు పెరిగింది. పింఛను రూ.4వేలకు పెంచగా.. మూడు నెలలకు బకాయిలు రూ.3000 కలిపి రూ. 7000 ప్రభుత్వం ఇస్తోంది. ఇక దివ్యాంగులకు గతంలో రూ.3వేల పెన్షన్ ఉంటే.. ఇప్పుడు ఒకేసారి రూ. 6వేలకు పెంచింది ప్రభుత్వం. దివ్యాంగుల్లో పూర్తి వైకల్యం ఉన్న వారికి రూ.5 వేల నుంచి రూ.15 వేలకు పింఛన్ పెరిగింది. అలాగే తీవ్ర అనారోగ్యంతో (కిడ్నీ, లివర్, గుండె మార్పిడి) బాధపడుతున్న వారికి ఇచ్చే పింఛను రూ.5000 నుంచి రూ.15వేలకు పెంచారు. ఈ కేటగిరీ కింది పింఛను పొందే వారి సంఖ్య 24,318 మంది ఉంది.

సీఎం చంద్రబాబు ముందుగానే చెప్పారు ఇళ్ల వద్దకే వచ్చి పెన్షన్ పంపిణీచేస్తామని. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,20,097 మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేస్తున్నారు. మొదటిరోజే 90శాతం వరకు పింఛన్ పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పెన్షన్ పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు కూడా పాల్గొననున్నారు.

Next Story