వైజాగ్‌లో మరో ప్రతిష్టాత్మక సదస్సు..ఎప్పుడంటే?
వచ్చే నెల 14,15 వైజాగ్ లో ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్య సదస్సు-2025 ను ఏపి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది.
By - Knakam Karthik |
వైజాగ్‌లో మరో ప్రతిష్టాత్మక సదస్సు..ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు స్వర్గధామం, ఇక్కడ పెట్టుబడులు పెట్టండి..ఇప్పుడు ప్రపంచ పెట్టుబడిదారులకు సీఎం చంద్రబాబు పిలుపు నిస్తున్నారు..వచ్చే నెల 14,15 వైజాగ్ లో ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్య సదస్సు-2025 ను ఏపి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. గతంలో 2016, 2017, 2018లో వైజాగ్ కేంద్రంగా సిఎం చంద్రబాబు పెట్టుబడులు సదస్సు నిర్వహించారు..ఇప్పుడు వైజాగ్ కు గూగుల్ డెటా సెంటర్ ఏర్పాటు ప్రకటన ప్రపంచ దృష్టిని ఆకర్షించింది..ఇప్పటకే పెట్టుబడులకు సదస్సు రావాలని దేశ విదేశాల్లో ఉన్న ప్రపంచ దిగ్గజ పెట్టుబడిదారులకు ఏపి ప్రభుత్వం అహ్వానాలు పంపుతుంది.
ఇదే సమయంలో సిఎం చంద్రబాబు ఈ నెల 22 నుంచి 24 వరకు దుబాయ్ లో పర్యటించనున్నారు. వచ్చే నెల 2 నుంచి 5 వరకు లండన్ పర్యటనకు సిఎం చంద్రబాబు సిద్దమయ్యారు ఇదే సమయంలో మంత్రి నారా లోకేష్ ఈ నెల 18 నుంచి 25 వరకు ఆస్ట్రేలియా లో పర్యటించనున్నారు.. వైజాగ్ భాగస్వామ్య సదస్సుకు రావాలని పెట్టుబడిదారులను సిఎం చంద్రబాబు స్వయంగా అహ్వానించనున్నారు. ఇప్పటికే గత నెలలో మంత్రులు నారాయణ, బీసీ జనార్ధన్ రెడ్డి దక్షిణ కోరియాలో పర్యటించారు.. పెట్టుబడుల భాగస్వాయ్య సదస్సుకు రావాల్సిందిగా పెట్టుబడుదారులను కోరారు..పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ జపాన్ లో పర్యటించారు..ఇప్పుడు సిఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ విదేశీ పర్యటనలకు సిద్దమయ్యారు..
ఇప్పటికే ప్రపంచంలోని పలు దిగ్గజ కంపెనీల ప్రతినిధులకు ఏపి ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపింది. భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని ఐక్య రాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గొట్రస్ కు ఏపి సర్కార్ అహ్వానం..ప్రపంచ దిగ్గజ సంస్ధలైన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ,ఎన్విడియా ప్రెసిడెంట్ & సీఈఓ జెన్సెన్ హువాంగ్..రోల్స్ రాయిస్ సిఇవో..బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ గవర్నర్,స్కాచ్ విస్కీ అసోసియేషన్ ఛైర్మన్, ఐకియా అధిపతికి,పెప్సీ ఛైర్మన్ లతో పాటు..అనేక అంతర్జాతీయ బ్యాంకులు, వాణిజ్య సంస్థల అధిపతులకు ఏపి ప్రభుత్వం ఆహ్వానాలు పంపింది..ఇక పలు దేశాల అధినేతలకు అహ్వానం పంపారు..ఇందులో సింగపూర్, మాల్డోవా, బల్గేరియా దేశాల ఉప ప్రధానులు విశాఖ సదస్సుకు హాజరవుతున్నట్లు ఏపి ప్రభుత్వానికి సమాచారం అందింది..ఇదే క్రమంలో 26 దేశాలకు చెందిన వాణిజ్య ,పరిశ్రమ శాఖ మంత్రులు సదస్సు కు హాజరవుతున్నారు..రాష్ట్రంలో విదేశీ విశ్వవిద్యాలయాలా ఏర్పాటుపై దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం..పలు విదేశీ విశ్వవిద్యాలయాల ఉన్నతాధికారులను విశాఖ భాగస్వామ్య సదస్సుకు ఆహ్వానించింది..వీరితో పాటు దేశియ దిగ్గజ కంపెనీల అధిపతులైన ఆనంద్ మహింద్రా, టాటా చంద్రశేఖరన్, గౌతమ్ అదానీ ,ముఖేష్ అంబానీ, కుమార్ మంగళం వంటి ప్రముఖులకు అహ్వానాలు పంపారు.