నాగబాబు చెప్పిన పరాయి వాడు ఎవరు?
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పోలింగ్ పర్వం ముగిసింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 May 2024 1:58 PM ISTనాగబాబు చెప్పిన పరాయి వాడు ఎవరు?
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పోలింగ్ పర్వం ముగిసింది. ఆయా పార్టీలు తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా తప్పకుండా గెలుస్తారని జనసైనికులు అంటూ ఉన్నారు. ఇక ఈ ఎన్నికల్లో కూటమితో జత కట్టిన జనసేన ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు ప్రజలు. అయితే పోలింగ్ సమయంలో మెగా బ్రదర్ నాగబాబు వేసిన ట్వీట్ సంచలనం అయింది.
"మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే...!" అంటూ నాగబాబు సంచలన ట్వీట్ వేశారు. ఇంతకూ ఈ ట్వీట్ ఎవరి గురించి అంటూ సోషల్ మీడియాలో చర్చిస్తూ ఉన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా మెగా ఫ్యామిలీ మొత్తం దిగొచ్చింది. అల్లు అర్జున్ కూడా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ట్వీట్ వేశారు. అయితే అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్లి వైసీపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడాన్ని జనసైనికులు తప్పుబడుతూ ఉన్నారు. అయితే నాగబాబు చెప్పింది అల్లు అర్జున్ గురించేనా అంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు. నాగబాబు ట్వీట్ కింద భిన్నమైన కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఇంతకూ ఆ పరాయి వాడు ఎవరు? మావాడు ఎవరు? అనేది నాగబాబు చెప్పాలి.