అన్న క్యాంటీన్ సింక్‌లో ప్లేట్లు వేసిందే వైసీపీ మూకలు: లోకేశ్
అన్న క్యాంటీన్ సింక్‌లో ప్లేట్లు వేసిందే వైసీపీ మూకలు: లోకేశ్
By Srikanth Gundamalla Published on 27 Aug 2024 2:00 PM ISTఅన్న క్యాంటీన్ సింక్‌లో ప్లేట్లు వేసిందే వైసీపీ మూకలు: లోకేశ్
ఏపీలో కూటమి ప్రభుత్వం ఇటీవల అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించింది. అయితే.. తాజాగా ఈ అన్న క్యాంటీన్లకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పరిశుభ్రత పాటించడం లేదంటూ అంటూన్నారు. ప్లేట్లను చేతులు కడిగే సింక్‌లో వేసి అందులోనే క్లీన్ చేస్తున్నట్లు వీడియోలో చూపించారు. దీనిపై తాజాగా మంత్రి నారా లోకేశ్ స్పందించారు.
తణుకు అన్న క్యాంటీన్‌లో ప్లేట్ల అంశంపై వైసీపీ కావాలనే విషప్రచారం చేస్తోందని మంత్రి నారా లోకేశ్ మండిపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన నారా లోకేవ్.. చేతులు కడిగే సింక్‌లో తినే ప్లేట్లను వేసింది వైసీపీ మూకలే అని చెప్పారు. విషప్రచారం చేసేందుకు ఈ పని చేసి.. వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారని చెప్పారు. సింక్‌లో ఉన్న ప్లేట్లు తీస్తుంటే.. వాటిపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. శుభ్రం చేయని ప్లేట్లను తీస్తుంటే.. వాటిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని నారా లోకేశ్ ఫైర్ అయ్యారు. అన్న క్యాంటీన్లపై జగన్ విషం చిమ్మడం ఇకనైనా ఆపాలనీ.. ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని సూచించారు. పేదలు కడుపునిండా భోజనం చేయడం కూడా ఇష్టం లేదా అని నారా లోకేశ్ ప్రశ్నించారు.
కాగా.. అంతకుముందు అన్న క్యాంటీన్‌లో పరిశుభ్రతపై హరేకృష్ణ మూమెంట్ ప్రతినిధులు, అధికారులు వివరాలను తెలిపారు. అడిగి వివరాలు తెలుసుకున్నారు. అన్న క్యాంటీన్‌లో అప్రశుభత్రకు తావు లేదని.. మురికి నీటిలో ప్లేట్లు శుభ్రం చేస్తున్నారన్న వార్త అవాస్తమవి వారు స్పష్టం చేశారు. ఎక్కువ మంది రావడంతో డస్ట్‌బిన్‌కు బదులుగా చేతులు కడిగే సింగ్ వద్ద ప్లేట్లు పెట్టారని అధికారులు తెలిపారు.