కాకాణికి సీబీఐ క్లీన్ చిట్.. చంద్రబాబుకి మంత్రి సవాల్
కోర్టు ఫైళ్ల మిస్సింగ్ కేసులో క్లీన్‌చిట్ రావడంతో మంత్రి కాకాణి గోవర్ధన్ స్పందించారు.
By Srikanth Gundamalla Published on 4 Feb 2024 6:50 AM GMTకాకాణికి సీబీఐ క్లీన్ చిట్.. చంద్రబాబుకి మంత్రి సవాల్
ఆంధ్రప్రదేశ్ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డికి కోర్టులో భారీ ఊరట లభించింది. నెల్లూరు కోర్టు ఫైళ్ల మిస్సింగ్ కేసులో సీబీఐ ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ మేరకు ఫైళ్ల మిస్సింగ్ కేసులో కాకాణి పాత్ర లేదంటూ చార్జ్‌షీట్ దాఖలు చేసింది సీబీఐ. మంత్రి కాకాణి నేరం జరిగిన విధానం పట్ల అవగాహన లేదని పేర్కొన్నారు. ఈ కేసులో సీబీఐ అధికారులు ఏడాది పాటు విచారణ జరిపింది. ఇందులో భాగంగా 403 పీజేల చార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. విచారణలో 88 మంది సాక్షకులను విచారించింది సీబీఐ. ఎలాంటి తప్పు చేయలేదని నిరూపణ కావడంతో మంత్రి కాకాణిపై వచ్చిన ఆరోపణలు సీబీఐ కొట్టి పారేసింది. మంత్రి కాకాణికి ఈ కేసు దోషులతో ఎలాంటి సంబంధం లేదని తెలిపింది.
కాగా..కోర్టు ఫైళ్ల మిస్సింగ్ కేసులో క్లీన్‌చిట్ రావడంతో మంత్రి కాకాణి గోవర్ధన్ స్పందించారు. ఈ క్రమంలో చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. ఆయనకు సవాల్ విసిరారు. తనపై వచ్చిన ఆరోపణలు అన్నీ తప్పు అని నిరూపించుకున్నాననీ.. తనలాగా చంద్రబాబు కూడా ఆరోపణలపై విచారణకు సిద్ధమా? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు దమ్ముంటే నాలా సీబీఐ విచారణ కోరగలరా అన్నారు. చంద్రబాబు అవినీతిపరుడు కాకపోతే సీబీఐ విచారణ కోరాలని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సవాల్ విసిరారు. ఈ మేరకు చంద్రబాబు చాలా అవినీతికి పాల్పడ్డారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో ప్రజాధనాన్ని లూటీ చేశారనీ ఆరోపించారు. తనపై నిరాధారమైన ఆరోపణలు చేసినవారికి తాజాగా సీబీఐ ఇచ్చిన చార్జ్‌షీటు చెంపపెట్టు అన్నారు. విచారణకు సిద్ధమని అప్పుడే కోర్టులో చెప్పానన్నారు మంత్రి కాకాణి. తనపై టీడీపీ కావాలనే దుష్ప్రచారం చేసిందని అన్నారు. మొదటి నుంచి పారదర్శకంగానే విచారణ సాగిందనీ.. సీబీఐ విచారణలో కూడా తన పాత్ర లేదని తేల్చిందని కాకాణి పేర్కొన్నారు.