ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), ఓవర్సీస్ మాన్పవర్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (OMCAP) వారు థట్రుయా (https://thatruya.com/) వారి భాగస్వామ్యంతో కువైట్‌లోని నిర్మాణ రంగంలో నైపుణ్య ఉద్యోగాల కోసం అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాల కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రానికి చెందిన అనుభవజ్ఞులైన నిర్మాణ కార్మికులకు విదేశీ ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ విషయమై APSSDC ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోహర్ మాట్లాడుతూ.. "సిరామిక్ ఫ్లోరింగ్, పెయింటింగ్, ఎలక్ట్రికల్ లేదా సీలింగ్ వర్క్స్‌లో ITI/డిప్లొమా కలిగి ఉండి, 3–5 సంవత్సరాల అనుభవంఉన్న 25 నుండి 50 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన పురుష అభ్యర్థుల నుండి 2 సంవత్సరాల కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం. నెలకు 200 నుండి 250 వరకు కువైట్ లో (సుమారుగా ₹56,000 నుండి ₹70,000 వరకు) జీతం ఉంటుంది. వీసా ప్రాసెసింగ్, విమాన టికెట్లు, వైద్య సదుపాయాలు, నివాసం వంటి ఏర్పాట్లను కంపెనీ వారు చెల్లిస్తారు. అభ్యర్థులు చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్, ITI/డిప్లొమా సర్టిఫికెట్, అనుభవం ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి."
ఆసక్తి ఉన్న అభ్యర్థులు https://naipunyam.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చు తమ బయోడేటాను skillinternational@apssdc.in కు మెయిల్ చేయవచ్చు లేదా హెల్ప్ లైన్ నంబర్ 9988853335 లోసంప్రదించవచ్చు. దరఖాస్తుకు చివరి తేదీ: 12 జూలై 2025..