ఏపీలో ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష
Andhra Pradesh High Court fined Five IAS officers.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదుగురు ఐఏఎస్ అధికారులకు
By తోట వంశీ కుమార్ Published on 2 Sept 2021 2:46 PM ISTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదుగురు ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తూ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. జైలు శిక్షపై అప్పీలుకు వెళ్లేందుకు నెల రోజుల పాటు శిక్షను సస్పెండ్ చేసింది. నెల్లూరు జిల్లాకు చెందిన తాళ్లపాక సాయి బ్రహ్మ అనే వ్యక్తికి నష్టపరిహారం చెల్లించకపోవటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశించినప్పటికీ సాయి బ్రహ్మకు న్యాయం చేయకపోవడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది.
మాజీ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్‌కు నెల రోజుల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించింది. అప్పటి నెల్లూరు కలెక్టర్ శేషగిరిరావుకు 2 వారాల జైలు శిక్ష, జరిమానా విధించింది. ఐఏఎస్ అధికారి రావత్‌కు నెల రోజుల జైలు శిక్ష, వేయి రూపాయల జరిమానా, ముత్యాల రాజుకు రెండు వారాల జైలు శిక్ష, జరిమానా, ఏఎంబీ ఇంతియాజ్‌కు రెండు వారాల జైలు శిక్ష, జరిమానా విధించింది. అధికారుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి పిటిషనర్‌కు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
నెల్లూరు జిల్లా తాళ్లపాకకు చెందిన సాయి బ్రహ్మ అనే మహిళ దగ్గర భూమి తీసుకొని పరిహారం ఇవ్వకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు చెప్పినా చెల్లింపుల్లో ఆలస్యం కావడంతో ఐఏఎస్ అధికారుల జీతాల నుంచి కట్ చేసి పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. ఈ శిక్షపై అప్పీల్ చేసుకునేందుకు హైకోర్టు నెల రోజులు గడువిచ్చింది.