Andhrapradesh: ఒకేసారి 57 మంది ఐఏఎస్‌ల బదిలీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 57 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. చిత్తూరు, నెల్లూరు, అనంతపురం, విజయనగరం,
By అంజి Published on 7 April 2023 3:34 AM GMTఅమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 57 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. చిత్తూరు, నెల్లూరు, అనంతపురం, విజయనగరం, బాపట్ల, కర్నూలు, కృష్ణా, సత్యసాయి జిల్లాలకు కూడా కొత్త కలెక్టర్లను ప్రభుత్వం నియమించింది. బదిలీలు, పోస్టింగ్‌ల ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి గురువారం రాత్రి విడుదల చేశారు. ఎన్నికలు వచ్చే ఏడాది జరుగనున్న నేపథ్యంలో.. ముందుగానే ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సీఎం జగన్ బదిలీ చేశారని తెలుస్తోంది. ఈ ఏడాది పాలనా పరంగా కీలక సమయం కావటంతో అధికారుల నియామకంలో భారీ కసరత్తు తరువాత సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. గత నెలలోనే బదిలీలు జరగాల్సి ఉన్నప్పటికీ సీఎం జగన్ అమోదం తెలుపకపోవడం, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో బదిలీలు చేయడం జరగలేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
1.జి.అనంత రాము – మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
2.RP సిసోడియా – APHRD డీజీ
3.B.శ్రీధర్ -.ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబెర్ సెక్రటరీ
4.సౌరభ్ గౌర్ – ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్, ఢిల్లీ
5.రిటైర్డ్ అధికారి ఆదిత్య నాధ్ దాస్ ను బాధ్యతల నుంచి రిలీవ్ చేసిన ప్రభుత్వం.
6.కోన శశిధర్ – ఐటీ శాఖ కార్యదర్శి
7. కె.హర్షవర్ధన్ – శాప్ ఎండీ
8.ఎంవీ శేషగిరి బాబు – కార్మిక శాఖ కమిషనర్
9.ఎం. హరిజావహర్ లాల్ – కార్మిక కర్మాగారాలు బాయిలర్స్ కార్యదర్శి
10.ప్రవీణ్ కుమార్ – APIIC ఎండీ
11.ఎస్.సత్యనారాయణ – దేవదాయ శాఖ కమిషనర్
12.పి.బసంత్ కుమార్ – స్వచ్ఛఆంధ్ర కార్పొరేషన్ ఎండీ
13.ఎ. సూర్యకుమారి – పంచాయతీ రాజ్ కమిషనర్
14.పి.కోటేశ్వరరావు – మున్సిపల్ శాఖ డైరెక్టర్
15.కేవీఎన్ చక్రధర్ బాబు – ఏపీ జెన్కో ఎండీ
16.ఎం. హరినరాయన్ – నెల్లూరు కలెక్టర్
17.ఎస్.నాగలక్ష్మి – విజయనగరం కలెక్టర్
18.ఎన్. ప్రభాకర్ రెడ్డి – సీసీఎల్ఏ జాయింట్ సెక్రటరీ
19.ఎస్ షన్మోహన్ – చిత్తూరు కలెక్టర్
20.ఎస్.సృజన – కర్నూల్ కలెక్టర్
21.కె.విజయ – సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్
22.పి.రంజిత్ బాషా – బాపట్ల కలెక్టర్
23.పి.రాజ బాబు – కృష్ణా జిల్లా కలెక్టర్
24 జీసీ.కిషోర్ కుమార్ – జీఎడి కి రిపోర్ట్
25.పి.అరుణ్ బాబు – సత్యసాయి కలెక్టర్
26.ఎం. గౌతమి – అనంతపురం కలెక్టర్
27.బి.లావణ్య వేణి – ఏలూరు కలెక్టర్
28.ఎం. విజయ సునీత – మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్
29.ఎ. సిరి – పార్వతీ పురం మన్యం జాయింట్ కలెక్టర్
30.జె.వెంకట మురళి – ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్
31.ఎస్.రామ సుందర్ – పశ్చిమగోదావరి జేసీ
32.సీఎం సైకత్ వర్మ – విశాఖ మున్సిపల్ కమిషనర్
33.తమీమ్ అన్సారియా – జీఎడి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు
34.సీహెచ్ శ్రీధర్ – ప్రకాశం కలెక్టర్
35.ఎస్.వెంకటేశ్వర్ – AP వైద్య విధాన పరిషత్ కమిషనర్
36.వి.వినోద్ కుమార్ – ఎండీ,స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్
37.బి.నవ్య – ఉపాధి కల్పన-శిక్షణ
38.పి.సంపత్ కుమార్ – NTR జిల్లా జాయింట్ కలెక్టర్
39.జి.గణేష్ కుమార్ – వైఎస్సార్ జిల్లా జేసీ
40.ఓ.ఆనంద్ కుమార్ – విశాఖ కమర్షియల్ టాక్స్ జేసీ
41.మహేష్ కుమార్ రావిరాల – కాకినాడ మున్సిపల్ కమిషనర్
42.రోనంకి గోపాల కృష్ణ – అడిషనల్ డైరెక్టర్,సర్వే-సెటిల్ మెంట్ శాఖ
43.అనుపమ అంజలి – GAD కి రిపోర్ట్
44.నారపురెడ్డి మౌర్య – తిరుపతి మున్సిపల్ కమిషనర్
45.కల్పన కుమారి – పీడీ,సీతంపేట ITDA
46.బి.శ్రీనివాసరావు – సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్
47.ఎ. భార్గవ్ తేజ – అడిషనల్ డైరెక్టర్,పంచాయతీ రాజ్ శాఖ
48.హిమాన్షు కౌశిక్ – అన్నమయ్య జిల్లా జేసీ
49.ఇమ్మడి పృథ్వి తేజ్ – సీఎండీ,APEPDCL
50.ఎం. జాహ్నవి – అనకాపల్లి జేసీ
51.నుపూర్ అజయ్ కుమార్ – సీసీఎల్ఏ జాయింట్ సెక్రటరీ
52.వి.అభిషేక్ – పీడీ,పాడేరు ITDA
53.వికాస్ మర్మట్ – కర్నూల్ జేసీ
54.పి.శ్రీనివాసులు – చిత్తూరు జేసీ
55.అభిషిక్త్ కిషోర్ – డిప్యూటీ సెక్రటరీ,ఫైనాన్స్ డిపార్ట్మెంట్
56.ఎస్.సురేష్ కుమార్ – ఇంటర్ బోర్డు ఇంచార్జి కమిషనర్
57.జె.వీరపాండ్యన్ – సివిల్ సప్లైస్ ఇంచార్జి డైరెక్టర్.