2023లో ఏపీ ప్రభుత్వ సెలవులు ఇవే
Andhra Pradesh Govt Restricted Holiday List 2023.2023 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ సెలవుల క్యాలెండర్‌ను
By తోట వంశీ కుమార్ Published on 16 Dec 2022 3:54 AM GMT2023 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ సెలవుల క్యాలెండర్‌ను జగన్ సర్కార్ విడుదల చేసింది. ఉద్యోగులకు సాధారణ, ఐచ్ఛిక సెలవులను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 23 సాధారణ సెలవులు, 22 ఐచ్ఛిక సెలవులు ఉన్నాయి. చంద్ర దర్శనం బట్టి సెలవులు ఇచ్చే రంజాన్, బక్రీద్, మొహరం, ఈద్ మిలాద్‌నబి వంటి పర్వదినాలు, తిథులను బట్టి హిందు పండుగల్లో ఏమైనా మార్పులు ఉంటే మీడియా ద్వారా ముందుగానే తెలియజేయనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.
సాధారణ సెలవుల్లో మూడు ఆదివారాలు, ఒకటి రెండో శనివారం రాగా.. ఐచ్ఛిక సెలవుల్లో నాలుగు ఆదివారాలు వచ్చాయి. జనవరిలో రెండో శనివారం భోగి సాధారణ సెలవుల్లో రాగా.. మకర సంక్రాంతి, దుర్గాష్టమి, దీపావళి ఆదివారాల్లో వచ్చాయి.
సాధారణ సెలవులు
జనవరి 15 - సంక్రాంతి - ఆదివారం
జనవరి 16 - కనుమ - సోమవారం
జనవరి 26 -రిపబ్లిక్ డే - గురువారం
ఫిబ్రవరి 18 - మహాశివరాత్రి - శనివారం
మార్చి 8 - హోలీ - బుధవారం
మార్చి 22 - ఉగాది - బుధవారం
మార్చి 30 - శ్రీరామ నవమి - గురువారం
ఏప్రిల్ 5 - జగ్జీవన్‌రామ్ జయంతి - బుధవారం
ఏప్రిల్ 7 - గుడ్ ఫ్రై డే - శుక్రవారం
ఏప్రిల్ 14 - అంబేద్కర్ జయంతి - శుక్రవారం
ఏప్రిల్ 22 - ఈద్ ఉల్ ఫితర్ - శనివారం
జూన్ 29 - బక్రీద్గు - గురువారం
జులై 29 - మొహర్రం - శనివారం
ఆగస్టు 15 - స్వాతంత్య్ర దినోత్సవం - మంగళవారం
సెప్టెంబర్ 6 - శ్రీకృష్టాష్టమి - బుధవారం
సెప్టెంబర్ 18 -వినాయక చవితి - సోమవారం
సెప్టెంబర్ 28 - ఈద్ మిలాదున్ నబీ - గురువారం
అక్టోబర్ 2 - గాంధీ జయంతి - సోమవారం
అక్టోబర్ 22 - దుర్గాష్టమి - ఆదివారం
అక్టోబర్ 23 - విజయ దశమి - సోమవారం
నవంబర్ 12 -దీపావళి- ఆదివారం
డిసెంబర్ 25 - క్రిస్మస్- సోమవారం
ఐచ్చిక (ఆప్షనల్) సెలవులు :
జనవరి 1 - న్యూ ఇయర్
ఫిబ్రవరి 5 - హజ్రత్ అలీ పుట్టినరోజు
మార్చి 7 - షబే బరాత్
ఏప్రిల్ 4 - మహావీర్ జయంతి
ఏప్రిల్ 18 - షబే ఖదర్ఏ
ఏప్రిల్ 21 - జమాతుల్ విదా ,
ఏప్రిల్ 23 - బసవ జయంతి,
ఏప్రిల్ 24 - షహాదత్ హజ్రత్ అలీ,
మే 5 - బుద్ధ పూర్ణిమ
జూన్ 20 - రథయాత్ర
జూలై 6 - ఈద్ ఏ ఘదీర్
జులై 28 మొహర్రం 9
ఆగస్టు 16 - పార్సీ న్యూ ఇయర్
ఆగస్టు 25 -వరలక్ష్మీ వ్రతం
సెప్టెంబర్ 5 - అర్బయీన్
సెప్టెంబర్ 9 - హజ్రత్ సయ్యద్ మొహమ్మద్ జువాన్ పురి మెహదీ పుట్టినరోజు
అక్టోబర్ 14 - మహాలయ అమావాస్య
అక్టోబర్ 24 - విజయదశమి
అక్టోబర్ 26 -యజ్ దహుం షరీఫ్
నవంబర్ 27 -కార్తీక పౌర్ణిమ, గురునానక్ జయంతి
డిసెంబర్ 24 - క్రిస్మస్ ఈవ్
డిసెంబర్ 26 - బాక్సింగ్ డే