Andhra Pradesh: ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు: గవర్నర్ నజీర్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ - 2023 సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను
By అంజి Published on 14 March 2023 12:15 PM ISTఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు: గవర్నర్ నజీర్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ - 2023 సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. సభలో.. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న డెవలప్‌మెంట్, సోషల్ వెల్ఫేర్ స్కీమ్‌లను గవర్నర్ వివరించారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను పెంచడానికి ప్రభుత్వం అవిశ్రాంత కృషి చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో నవరత్నాలతో సంక్షేమ పాలన అందుతోందని వివరించారు. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా అవినీతి లేకుండా నేరుగా లబ్దిదారులకే డబ్బులు అందిస్తున్నామని తెలిపారు.
వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి సాధిస్తున్నట్లు గవర్నర్ అబ్దుల్ నజీర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ రంగాల్లో 11.43 శాతం వృద్ధిరేటుతో అద్భుత ప్రగతి సాధిస్తోందని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. 'నాడు - నేడు' పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల ఆధునీకరణను చేపట్టిందన్నారు. ఈ పథకం కింద మొదటి విడతలో రూ.3669 కోట్లతో 15,717 పాఠశాలలు, రెండో విడతలో రూ.8,345 కోట్లతో 22,345 పాఠశాలలు అభివృద్ధి చేశారన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలతో ప్రజల దగ్గరికే వద్దకే పాలన అందిస్తున్నట్లు తెలిపారు. అమ్మ ఒడి కింద 44 లక్షల మంది తల్లులకు రూ.15 వేలు చొప్పున రూ.9,900 కోట్లు అందించినట్లు చెప్పారు.
కుల, మతాలకు అతీతంగా రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలు చేరుతున్నాయని గవర్నర్ పేర్కొన్నారు. విద్యా రంగంపై గవర్నర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నూతన వైద్య కళాశాలలు, రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 17 వైద్య కళాశాలలు, కురుపాంలో గిరిజన ఇంజినీరింగ్ కళాశాల, కడపలో డాక్టర్ వైఎస్ ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామన్నారు. డిజిటల్ లెర్నింగ్‌కు ప్రాధాన్యతనిస్తూ విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని, ద్విభాషా పాఠ్యపుస్తకాలు, జగనన్న విద్యా కానుక కింద ఆంగ్ల ప్రయోగశాలలతో పాటు విద్యార్థులకు రూ.690 కోట్ల విలువైన 5.20 లక్షల ట్యాబ్‌లను పంపిణీ చేసి అందిస్తున్నామని గవర్నర్ తెలిపారు. ఆర్థిక భారం లేకుండా ఉచితంగా ఉన్నత విద్యను అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని అన్నారు.
1.4 కోట్ల హెల్త్‌కార్డులు ఇచ్చామని, పీహెచ్‌సీల్లో ఇద్దరు వైద్యుల నియామకానికి చర్యలు తీసుకున్నామని వైద్యారోగ్యశాఖపై గవర్నర్ ప్రసంగించారు. వైఎస్ ఆర్ జగనన్న కాలనీల్లో పేదలకు ఇళ్లు, మహిళల పేరుతో 30.65 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని, నేతన్న నేస్తం కింద నేత కార్మికులకు ఏడాదికి రూ.24 వేలు ఆర్థిక సాయం అందించామన్నారు. సంక్షేమ పథకాలన్నింటిని గవర్నరు టచ్ చేసి ప్రభుత్వాన్ని కొనియాడారు. రాష్ట్రంలో కొత్తగా 56 బీసీ కార్పొరేషన్లు, ఎస్సీలకు 3, ఎస్టీలకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 4 డిప్యూటీ సీఎం పదవులు, 70 శాతం కేటాయించి బలహీన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని గవర్నర్ తెలిపారు.
15.14 లక్షల ఎస్సీ, 4.5 లక్షల ఎస్టీ కుటుంబాలకు జగజ్జీవన జ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తున్నామన్నారు. చెత్త రహిత, చెత్త రహిత గ్రామాలే లక్ష్యంగా ఏపీ ముందుకెళ్తోందని, స్వచ్ఛ సర్వేక్షణ్‌లో అగ్రగామిగా ఉందని, గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా ఏపీ ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయని అబ్దుల్ నజీర్ అన్నారు.