ఎన్నికల వేళ సీఎం జగన్ గుడ్‌న్యూస్.. ఎల్లుండి అకౌంట్లలోకి డబ్బులు
ఎన్నికల వేళ మరో పథకం ద్వారా లబ్ధిదారులకు డబ్బులను అందజేయనుంది వైసీపీ ప్రభుత్వం.
By Srikanth Gundamalla Published on 5 March 2024 10:32 AM ISTఎన్నికల వేళ జగన్ గుడ్‌న్యూస్.. ఎల్లుండి అకౌంట్లలోకి డబ్బులు
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. దాంతో.. రాజకీయ పార్టీలన్నీ ఓట్ల కోసం ప్రజల్లో ప్రచారం జోరుగా చేస్తున్నాయి. ఇప్పటికే అభ్యర్థులను కూడా ప్రతిపక్ష పార్టీ కూటమి విడుదల చేసింది. ఎలాగైనా వైసీపీ సర్కార్‌ను గద్దె దించి తాము అధికారంలోకి వస్తామని దీమాతో ఉన్నారు. ఇక మరోవైపు అధికార పార్టీ వైసీపీ తమ వ్యూహాలను అమలు చేస్తోంది. సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి వెళ్తుంది. ఎన్నికల వేళ మరో పథకం ద్వారా లబ్ధిదారులకు డబ్బులను అందజేయనుంది వైసీపీ ప్రభుత్వం. వైఎస్సార్ చేయూత పథకం నిధులను సీఎం జగన్ అనకాపల్లిలో బటన్ నొక్కి మహిళల అకౌంట్లలో జమ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ ఖరారు చేసింది. సీఎం జగన్ సభకు అధికారులు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. కాగా.. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా లబ్ధిదారులకు ఏడాదికి రూ.18,750 ఇస్తున్నారు. ఇప్పటికే మూడు విడుతలుగా డబ్బులు జమ చేసింది. ఇప్పుడు చివరి విడత నిధులను మార్చి 7వ తేదీన విడుదల చేయనున్నారు.
వైఎస్సార్ చేయూత పథకం ద్వారా 31.23 లక్షల మంది మహిళలు లబ్ధి పొందనున్నారు. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లోని మహిళలకు ఏడాదికి రూ.18,750 ఆర్థిక సాయం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక మార్చి 8న మహిళల దినోత్సవం ఉంది. దానికి ముందు ఒక్కరోజు ఈ పథకం ద్వారా మహిళల అకౌంట్లలో డబ్బులు జమ చేసేందుకు వైసీపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అంతేకాక.. వైఎస్సార్ చేయూత లబ్ధిదారులకు నిధులతో పాటు లేఖలు కూడా అందించనున్నట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ పేరుతో ఉన్న లేఖలను వాలంటీర్లు అందిస్తారని సమాచారం. ఈ లేఖల్లో ఇప్పటి వరకు ఎన్ని నిధులు ప్రభుత్వం ఇచ్చిందే లెక్కలు, వివరాలు ఉండనున్నాయని తెలుస్తోంది.
త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక్కసారి ఎన్నికల షెడ్యూల్ వస్తే ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు ఇవ్వడానికి వీలు ఉండదు. కాబట్టి ముందుగానే వైఎస్సార్ చేయూత నిధులు విడుదల చేస్తుంది ప్రభుత్వం. మహిళలలను ఆకట్టుకునేందుకు ఈ నిధులను విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ నెల 10వ తేదీన అద్దంకిలో వైసీపీ పార్టీ సిద్ధం సభను ఏర్పాట్ఉల చేస్తోంది. ఈ సభ ద్వారా వైసీపీ మేనిఫెస్టోను విడుద చేసే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.