అమరావతి: వచ్చే ఏడాదిలో పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారుల రిటైర్మెంట్ జాబితాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఈ మేరకు సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో పని చేస్తోన్న ఎనిమిది మంది సీనియర్ ఐపీఎస్ అధికారుల పదవీ విరమణపై అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి.
కాగా 1990 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి అంజనీ కుమార్ వచ్చే ఏడాది జనవరి 31న పదవీ విరమణ చేస్తారు. 1991 బ్యాచ్ కు చెందిన సీనియర్ ఐపిఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్ వచ్చే ఏడాది జూన్ 30న ఉద్యోగ విరమణ చేయనున్నారు. 1992 బ్యాచ్ కు చెందిన సీనియర్ ఐపిఎస్ అధికారి సీతారామాంజనేయులు వచ్చే ఏడాది ఆగస్ట్ 31 న పదవీ విరమణ చేయనుండగా, 1992 బ్యాచ్ కు చెందిన సీనియర్ ఐపిఎస్ అధికారి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వచ్చే ఏడాది ఏప్రియల్ 30న ఉద్యోగ విరమణ చేస్తారు. ఇక 1993 బ్యాచ్ కు చెందిన సీనియర్ ఐపిఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ వచ్చే ఏడాది జూన్ 30న ఉద్యోగ విరమణ చేస్తారు. తర్వాత 1994 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపిఎస్ అధికారి బాలసుబ్రమణ్యం వచ్చే ఏడాది అక్టోబర్ 30న పదవీ విరమణ చేయనుండగా.. 2005 బ్యాచ్ కు చెందిన సీనియర్ ఐపిఎస్ అధికారి జి.పాల్ రాజు వచ్చే ఏడాది జనవరి 31న ఉద్యోగ విరమణ చేస్తారు. చివరగా 2015 బ్యాచ్ కు చెందిన సీనియర్ ఐపిఎస్ అధికారి కె.ఎస్.ఎస్.వి. సుబ్బారెడ్డి వచ్చే ఏడాది మార్చి 31న పదవీ విరమణ చేస్తారు.