Andhrapradesh: ఉచిత సిలిండర్‌.. వీరు మాత్రమే ఈ పథకానికి అర్హులు

దీపం 2.0 కింద ఉచితంగా సిలిండర్ అందిస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అక్టోబర్‌ 31వ తేదీ నుంచి సిలిండర్ల పంపిణీ ప్రారంభమైంది.

By అంజి  Published on  3 Nov 2024 7:22 AM IST
Andhra Pradesh government, free cylinder scheme, APnews

Andhrapradesh: ఉచిత సిలిండర్‌.. వీరు మాత్రమే ఈ పథకానికి అర్హులు

దీపం 2.0 కింద ఉచితంగా సిలిండర్ అందిస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అక్టోబర్‌ 31వ తేదీ నుంచి సిలిండర్ల పంపిణీ ప్రారంభమైంది. ఈ క్రమంలోనే తాము ఈ పథకానికి అర్హులమా కాదా? అనే అనుమానాలు పలువురిలో వ్యక్తమవుతున్నారు. రేషన్‌ కార్డులతో పోలిస్తే.. అర్హుల సంఖ్య తక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో 1.54 కోట్ల వంట గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. తాత్కాలిక అంచనా ప్రకారం.. ఫ్రీ సిలిండర్‌కు 1.08 కోట్ల కనెక్షన్లు అర్హత పొందగా, రేషన్ కార్డులు 1.48 కోట్లు ఉన్నాయి. కొంతమంది ఆధార్‌ ఇవ్వకపోవడంతో అర్హత పొందలేకపోయారు. వీరు ఆధార్‌ అనుసంధానం చేసుకుంటే ఫ్రీ సిలిండర్‌ పథకానికి అర్హులు అవుతారు.

ఉచిత సిలిండర్‌ పొందాలంటే రేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డు, గ్యాస్‌ కనెక్షన్‌ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. కుటుంబ సభ్యుల్లో ఎవరి పేరు మీద కనెక్షన్‌ ఉందో.. ఆ వ్యక్తి పేరు రేషన్‌ కార్డులో కూడా ఉండాలి. అప్పుడే రాయితీ వస్తుంది. భార్య పేరుతో రేషన్‌ కార్డు ఉండి, భర్త పేరుతో గ్యాస్‌ కనెక్షన్‌ ఉన్నా అర్హులేనని ప్రభుత్వం తెలిపింది. ఒక రేషన్‌ కార్డులోని సభ్యుల పేర్లతో రెండు మూడు గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నా.. రాయితీ ఒక్క కనెక్షన్‌కే వస్తుంది. గ్యాస్‌ రాయితీ జమ కావాలంటే ఈ కేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో లేదా డీలర్‌ వద్దకు వెళ్లి ఈ కేవైసీ చేసుకోవచ్చు. సిలిండర్‌ అందాక రెండు రోజుల్లో ఆయిల్‌ కంపెనీలే సొమ్మును లబ్ధిదారుల ఖతాల్లో వేస్తాయి. ఏవైనా సమస్యలు ఉంటే 1967 టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేయొచ్చు.

Next Story