ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. వారికి పెన్షన్లు లేవ్..!
ఆంధప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.
By Srikanth Gundamalla Published on 21 Aug 2024 10:54 AM ISTఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. వారికి పెన్షన్లు లేవ్..!
ఆంధప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రి బాలవీరాంజనేయ స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. బోగస్ సర్టిఫికెట్లతో పెన్షన్లు పొందేవారి ప్రయత్నాన్ని అడ్డుకోవాలని ఈ మేరకు మంత్రి బాలవీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు పెన్షన్ కచ్చితంగా అందేలా చూడాలన్నారు. బోగస్ సర్టిఫికెట్లతో పెన్షన్లు పొందేవారికి అడ్డుకట్ట వేయాలన్నారు. అంతేకాదు.. అలాంటి వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు మంత్రి బాలవీరాంజనేయ చెప్పారు.
అమరావతి సచివాలయంలో అధికారులతో మంత్రి సమీక్షించిన మంత్రి బాల వీరాంజనేయ ఈ కామెంట్స్ చేశారు. దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిళ్లు ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించాలని.. ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేకంగా రేషన్ కార్డులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల అందించాలన్నారు. ఏపీ ప్రభుత్వం దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్స్‌కు కల్పిస్తున్న సౌకర్యాలు, అందిస్తున్న సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు మంత్రి బాల వీరాంజనేయ స్వామి. అధికారులు అలసత్వం వీడి బాధ్యతతో పని చేయాలన్నారు. అధికారులు సంబంధిత శాఖలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉండాలని సూచించారు.
రాష్ట్రంలోని ఇటీవల బోగస్ సర్టిఫికెట్లతో కొందరు పెన్షన్లు తీసుకుంటున్నారని అధికారులు గుర్తించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా సామాజిక తనిఖీలు చేపట్టారు. కొంతమంది చెవుడు ఉన్నట్లు ఫేక్ సర్టిఫికెట్లు పొంది పింఛన్లు తీసుకుంటున్నట్లు గుర్తించారు. అధికారులు బోగస్ సర్టిఫికెట్ల విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. కాగా.. రాష్ట్రంలో మొత్తం 8 లక్షలమంది దివ్యాంగ పింఛన్లు అందుకుంటున్నారు. అందులో అనర్హులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.