గుడ్‌న్యూస్..ఏపీలో ఈ పథకం కింద రూ.4లక్షలు
ఆంధ్రప్రదేశ్, కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నాయి.
By Srikanth Gundamalla Published on 29 July 2024 6:39 AM IST
గుడ్‌న్యూస్..ఏపీలో ఈ పథకం కింద రూ.4లక్షలు
ఆంధ్రప్రదేశ్, కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకానికి సంబంధించి మార్గదర్శకాలను సవరించారు. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా నిధుల్ని కేటాయించాల్సిందేనని కేంద్రం తెలిపింది. సవరించిన మార్గదర్శకాలను ఎన్నికలకు ముందే రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం పంపింది. ఈ పథకం కింద కొత్తగా ఎంపిక చేసే అబ్ధిదారులకు గుడ్‌న్యూస్ చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఒక నుంచి ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.4లక్షలు అందించనున్నారు. ఈ మొత్తం డబ్బుల్లో కేంద్రం తన వాటాగా రూ.2.50 లక్షలు ఇవ్వనుంది. రాష్ట్ర ప్రభుత్వం వాటా కచ్చితంగా మరో రూ.1.50 లక్షలు ఉండాలని కేంద్ర ప్రభుత్వం గైడ్‌లైన్స్‌లో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం సాంకేతికతను వినియోగించి చేపట్టే నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం అదనంగా మరికొంత సాయాన్ని కూడా అందించుంది. దీనికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తర్వాత దాదాపు ఇదే మొత్తంలో సాయం ఖరారయ్యే అవకాశం ఉందని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు సీఎం చంద్రబాబు సోమవారం గృహనిర్మాణంపై సమీక్ష నిర్వహిస్తారు. అధికారులు సీఎంకు ఇదే విషయంపై నివేదిక అందించనున్నారు.
దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పట్టణ)-2.0 పథకం కింద 3 కోట్ల ఇళ్ల నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇందులో పట్టణ ప్రాంతాల్లోని పేదలకు కోటి ఇళ్లు నిర్మించనున్నారు. రాష్ట్రంలో పట్టణాభివృద్ధి సంస్థల్లోని పేదలకూ ఈ పథకం వర్తింపజేయనున్నాయి ప్రభుత్వాలు. ఆంధ్రప్రదేశ్‌లో 23 పట్టణాభివృద్ధి సంస్థలు ఉన్నాయి. రాష్ట్రంలో ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలతోపాటు ఉపాధి హామీ పథకం కింద మరో రూ.30 వేలు కూడా అందిస్తారు. ఏపీలో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పేదలకు ఇళ్లపై దూకుడు పెంచింది.. ముందుగా పెండింగ్‌లో ఉన్న టిడ్కో ఇళ్ల అంశంపై.. ఆ తర్వాత కొత్త ఇళ్లపై ఫోకస్ పెట్టింది. కేంద్రం సహకారంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది.