మహిళా ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్

మహిళా ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది.

By Srikanth Gundamalla  Published on  17 March 2024 10:10 AM GMT
andhra pradesh, government, good news,  woman employees,

మహిళా ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ 

మహిళా ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. చైల్డ్‌ కేర్‌ లీవ్స్‌కు సంబంధించిన అంశంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లల సంరక్షణ సెలువులపై గతంలో నుంచి ఉన్న గడువుని ఏపీ ప్రభుత్వం తొలగించింది. ఈ మేరకు శనివారమే ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. గతంలో పిల్లలకు 18 ఏళ్ల వయసు వచ్చేలోగా మహిళా ఉద్యోగులు ఈ సెలవులను వాడుకోవాల్సి ఉండేది. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ గడువుని తొలగించింది. దాంతో.. మహిళా ఉద్యోగులు విరమణ లోగా ఎప్పుడైనా ఈ సెలవులను వాడుకునే వెసులుబాటు కల్పించింది.

ఎన్నికల వేళ రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. అమరావతి రాజధాని పరిధిలో సచివాలయ ఉద్యోగులకు స్థలాలు కేటాయించింది. ఈ మేరకు శనివారమే ఉత్తర్వులు జారీ చేసింది. సెక్రటేరియట్‌ ఉద్యోగులకు అమరావతిలోని పిచ్చుకలపాలెం పరిధిలో స్థలాలు ఇస్తున్నట్లు తెలిపింది. మరోవైపు శనివారం ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే ఏపీ ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షన్ దారులకు డీఏల మంజూరు, మున్సిపల్ కార్మికుల సమ్మె కాలంలో నమోదైన కేసులను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే అంగన్వాడీ కార్యకర్తలకు సమ్మెకాలానికి సంబంధించిన వేతనాలను మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసకున్న ఈ నిర్ణయాలపై విపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల్లో లబ్ధి పొందొందుకే ఈ నిర్ణయాలనీ విమర్శిస్తున్నాయి.

Next Story