అమరావతి: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర పరీక్షలను రద్దు చేస్తారనే వార్తలపై ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇచ్చింది. ఆ పరీక్షలను యథాతథంగా నిర్వహించాలని నిర్ణయించింది. అలాగే ఇంటర్నల్ మార్క్స్ ఆలోచనను విరమించుకుంది. వివిధ వర్గాల నుంచి స్వీకరించిన సలహాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్ అమలు చేయనుంది. మ్యాథ్స్‌లో ఏ, బీ పేపర్లు కాకుండా ఒకే పేపర్‌గా ఇస్తారు. బోటనీ, బయాలజీ కలిపి ఒకే పేపర్ ఉంటుంది.
అయితే అంతకుముందు వచ్చే విద్యా సంవత్సరం నుంచి మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలను తొలగించాలని ఇంటర్ విద్యా మండలి భావించింది. విద్యార్ధులపై పరీక్షల ఒత్తిడిని తగ్గించాలనే లక్ష్యంతో.. కేవలం రెండో సంవత్సరం పబ్లిక్ పరీక్షను... ఆ ఏడాది సిలబస్ తో నిర్వహించాలనుకుంది. ఈ మేరకు తమ సలహాలు, సూచనలు ఇవ్వాలని విద్యార్ధులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలను కోరుతూ ప్రతిపాదిత సంస్కరణల వివరాలను ఇంటర్మీడియట్ బోర్డు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది.