ఏపీ రైతులకు తీపి కబురు, అకౌంట్లలో డబ్బులు జమ

ఆంధ్రప్రదేశ్‌ కూటమి ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది.

By Srikanth Gundamalla  Published on  12 Aug 2024 1:26 AM GMT
andhra pradesh, good news,  farmers, minister nadendla,

ఏపీ రైతులకు తీపి కబురు, అకౌంట్లలో డబ్బులు జమ

ఆంధ్రప్రదేశ్‌ కూటమి ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. చాలా ఎదురుచూస్తున్న రైతులకు ఎట్టకేలకు శుభవార్త చెప్పింది. గత రబీ సీజన్‌లో ధాన్యం విక్రయించిన రైతులకు మొత్తం రూ.674.47 కోట్ల బకాయిలను విడుదల చేసేందుకు సిద్ధం అయ్యింది. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సోమవారం నిధులను విడుదల చేస్తారు.

గత వైసీపీ ప్రభుత్వం మొత్తం 84,724 మంది రైతులకు రూ.1,674.,47 కోట్ల బకాయిలు చెల్లించలేదు. ఇక ఏపీలో ఇటీవల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కూటమి.. రైతుల ఇబ్బందులను గుర్తించి వారి సమస్యల పరిష్కారినికి అడుగులు వేస్తోంది. గత నెలలో 47,350 మందికి రూ.వెయ్యి కోట్లు విడుదల చేసింది. ఇక తాజాగా మిగిలి వారికి కూడా గత రబీ సీజన్‌ బకాయిలను చెల్లించనుంది. అమలాపురంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని రైతులకు చెక్కులు పంపినీ చేస్తారు.

గత వైసీపీప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం సేకరించి రూ.2,763 కోట్లు బకాయిలు పెట్టిందని నాదెండ్ల మనోహర్ విమర్శలు చేశారు. ఇక కూటమి ప్రభుత్వం మాత్రం రైతుల సంక్షేమం కోసం పనిచేస్తోందని చెప్పారు. రాష్ట్రంలో రైతుల బకాయిలు చెల్లించడాన్నే అత్యంత ప్రాధాన్య అంశంగా తీసుకుని చెల్లిస్తామన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని.. ఈ ధర నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది నాదెండ్ల మనోహర్ అన్నారు. రైతు బజార్ల ద్వారా నాణ్యమైన కందిపప్పు, బియ్యాన్ని రాయితీపై ప్రజలకు అందిస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

Next Story