ఏపీలో ఫ్రీ బస్సు జర్నీతో రూ.250 కోట్ల భారం.. రేపు సీఎం సమీక్ష
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టింది.
By Srikanth Gundamalla Published on 28 July 2024 6:47 AM ISTఏపీలో ఫ్రీ బస్సుతో రూ.250 కోట్ల భారం.. రేపు సీఎం సమీక్ష
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టింది. ఇందులో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం ఒక్కటి. దీని అమలుపై ఆర్టీసీ ధికారులు అధ్యయన నివేదికను సిద్దం చేశారు. అయితే.. ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించడం వల్ల ప్రభుత్వంపై 250 కోట్ల రూపాయల భారం పడుతుందని అధ్యయనంలో వెల్లడి అయ్యింది. మరోవైపు ఈ పథకం ఇప్పటికే తెలంగాణ, కర్ణాటకలో అమలవుతోంది. రెండు రాష్ట్రాలకు వెళ్లిన అధికారులు.. ఏఏ బస్సుల్లో ఉచిత సదుపాయం కల్పింస్తున్నారు.. ప్రభుత్వం నుంచి రీయింబర్స్‌మెంట్ సహా ఇతర వివరాలను తెలుసుకున్నారు. ఇక ఈ నివేదికను సీఎం చంద్రబాబుకి సోమవారం ఇవ్వనున్నారు అధికారులు. సోమవారమే ఈ పథకంపై కీలక చర్చజరగనుంది.
ఏపీలో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీసులతో పాటు, విజయవాడ ,విశాఖ నగరాల్లోని సిటీ ఆర్డినరీ, మెట్రో సర్వీసుల్లో ఉచిత బస్సు ప్రయాణం కల్పించే అవకాశాలు కల్పిస్తున్నాయి. తెలంగాణ, కర్ణాటకలో జీరో టికెట్ ఇస్తున్నారు. టికెట్‌పై జీరో ఉన్నా.. మెషీన్‌లో మాత్రం అసలు చార్జీ నమోదు అవుతుంది. ఇలా టికెట్ మొత్తం విలువను అధికారులు లెక్కిస్తారు. ఆ తర్వాత ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది. తెలంగాణ కర్ణాటకలో ఉచిత బస్సు ప్రయాణ సదుపాయానికి ముందు ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్షీ 60 శాతం వరకు ఉండేది. కానీ.. ఈ పథకం వచ్చాక 90 శాతానికి పెరిగిందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై పడే భారం, సహా బస్సు సౌకర్యాలు తదితర అంశాలపై ప్రభుత్వం చర్చించనుంది.