డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు అస్వస్థత
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జ్వరంతో బాధపడుతున్నారు.
By Srikanth Gundamalla
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జ్వరంతో బాధపడుతున్నారు. బుధవారం నుంచి ఆయన తీవ్ర జ్వరంతో ఇబ్బందిపడుతున్నారు. మంగళవారం నాడు తిరుమల మెట్లు ఎక్కిన తర్వాత అస్వస్థతకు గురయ్యారు. ఆ సమయంలో ఆయన వెన్నునొప్పితో బాధపడ్డారు. అస్వస్థతకు గురైన పవన్‌ను తిరుమలలోని అతిథి గృహంలోనే వైద్య సేవలు అందిస్తున్నారు. కాగా.. తిరుపతి బాలాజీ కాలనీలోని జ్యోతిరావు పూలే కూడలిలో వారాహి బహిరంగ సభ ఉండనుంది. అయితే జ్వరంతోనే వారాహి సభలో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు.
జ్వరం కారణంగా అతిధిగృహంకే పరిమితమైన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అందుబాటులో ఉన్న నాయకులతో భేటీ అయ్యారు. గురువారం జరిగే వారాహి సభలో ఏం మాట్లాడాలన్న అంశంపై నేతలతో పవన్ చర్చించారు. సాయంత్రం 6 గంటలకు జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద జరగనున్న వారాహి సభలో పాల్గొంటారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమావేశమయ్యారు. టీటీడీలో చేపడుతున్న అభివృద్ధి పనుల గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు అదనపు ఈవో వెంకయ్య చౌదరి వివరించారు.