Andhrapradesh: కానిస్టేబుల్‌ ఫలితాలు విడుదల.. త్వరలోనే ట్రైనింగ్

కానిస్టేబుల్‌ ఎగ్జామ్‌ ఫైనల్ ఫలితాలు విడుదల అయ్యాయి. మంగళగిరిలోని పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో హోంమంత్రి అనిత, డీజీపీ హరీశ్‌ గుప్తా ఫలితాలు విడుదల చేశారు.

By అంజి
Published on : 1 Aug 2025 10:18 AM IST

Andhra Pradesh, Constable Results, Results Released

Andhrapradesh: కానిస్టేబుల్‌ ఫలితాలు విడుదల

అమరావతి: కానిస్టేబుల్‌ ఎగ్జామ్‌ ఫైనల్ ఫలితాలు విడుదల అయ్యాయి. మంగళగిరిలోని పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో హోంమంత్రి అనిత, డీజీపీ హరీశ్‌ గుప్తా ఫలితాలు విడుదల చేశారు. అభ్యర్థులు ఏపీ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు వెబ్ సైట్ slprb.ap.gov.in లో తమ ఫలితాలు తెలుసుకోవచ్చు. ఈ ఫలితాల్లో 168 మార్కులతో గండి నానాజి ప్రథమ స్థానంలో నిలిచినట్లు అధికారులు ప్రకటించారు. 159 మార్కులతో రమ్య మాధురి రెండో స్థానం, 144.5 స్కోర్ తో మెరుగు అచ్యుతారావు మూడో స్థానంలో నిలిచాడు.

ఈ రిక్రూట్ మెంట్ లో భాగంగా 6,100 పోస్టులను భర్తీ చేయనున్నారు. 2023 జనవరిలో కానిస్టేబుల్‌ పరీక్షలు జరిగాయి. మొత్తం 5,09,579 మంది అభ్యర్థులు కానిస్టేబుల్ పరీక్షకు అప్లయ్ చేసుకున్నారు. వీరిలో 5,03,487 మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోగా, 4,58,219 మంది అభ్యర్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత మార్కులను ఓసీలకు 40%, బీసీలకు 35%, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 30 శాతంగా నిర్ణయించారు.

ఇందులో 95,208 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. వీరికి 2024 డిసెంబరులో దేహదారుఢ్య పరీక్షలు పూర్తి చేశారు. ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షల్లో 38,910 మంది అర్హత సాధించారు. ఇక మెయిన్స్ పరీక్షలకు మొత్తం 37,600 మంది హాజరుకాగా.. 33,921 మంది క్వాలిఫై అయ్యారు. దీంతో ఇవాళ తుది ఫలితాలను విడుదల చేశారు. ఎంపికైన వారికి త్వరలోనే శిక్షణను ప్రారంభిస్తారు.

Next Story