ఆంధ్రరత్న భవన్ వద్ద ఉద్రిక్తత, మెగా డీఎస్సీని దగా చేశారు: షర్మిల
ఏపీ కాంగ్రెస్ 'చలో సెక్రటేరియట్' కార్యక్రమానికి పిలుపునిచ్చింది.
By Srikanth Gundamalla Published on 22 Feb 2024 6:47 AM GMTఆంధ్రరత్న భవన్ వద్ద ఉద్రిక్తత, మెగా డీఎస్సీని దగా చేశారు: షర్మిల
ఏపీ కాంగ్రెస్ 'చలో సెక్రటేరియట్' కార్యక్రమానికి పిలుపునిచ్చింది. మెగా డీఎస్సీని ప్రకటించాలనే డిమాండ్‌తో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సహా కాంగ్రెస్ పార్టీ నేతలను పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌లోనే అడ్డుకున్నారు. వారు అక్కడి నుంచి బయటకు వెళ్లకుండా నిర్బంధించారు. భారీగా పోలీసులు మోహరించారు. గురువారం ఆంధ్రరత్న భవన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
పార్టీ కార్యాలయం వద్దకు వచ్చిన పలువురు నేతలను కూడా పోలీసులుఅక్కడి నుంచి తరలించారు. దాంతో.. పోలీసుల వైఖరిని వైఎస్ షర్మిల వ్యతిరేకించారు. పార్టీ నేతలతో కలిసి ఆంధ్రరత్న భవన్‌లోనే నిరసనకు దిగారు. బైఠాయించి ఆందోళన చేశారు. ఉద్రిక్త పరిస్తితులు కనిపించాయి.క కాంగ్రెస్ శ్రేణులు, పోలీసుల మధ్య స్వల్ప తోపులాట కూడా చోటుచేసుకుంది. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారంటూ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు అండగా నిలబడితే మమ్మల్ని అడ్డుకుంటారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా లేదా అంటూ ప్రశ్నించారు. తమ నిరసనను ఆపాలని చూస్తే ముమ్మాటి రాష్ట్రంలో నియంత పాలనే అని వైఎస్ షర్మిల అన్నారు.
మెగా డీఎస్సీ ఇస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుందని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. 23వేల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి.. కేవలం 6వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చారని చెప్పారు. వైసీపీ ప్రబుత్వం రాష్ట్ర ప్రజలకు, నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక మిగతా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ.. రాత్రి నుంచి పోలీసుల దమనకాండ కొనసాగుతోందని అన్నారు. అక్రమంగా కేసులు పెడుతున్నారంటూ ఆరోపించారు. సీనియర్ నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారంటూ మండిపడ్డారు. జగన్ ఇచ్చిన హామీలను అమలుచేయాలని డిమాండ్ చేశారు. అలాగే.. చలో సచివాలయం నిర్వహించి తీరతామని కాంగ్రెస్ నేతలు అన్నారు.
‘చలో సెక్రటేరియట్’ కార్యక్రమానికి ఏపీ కాంగ్రెస్ పిలుపు
— Newsmeter Telugu (@NewsmeterTelugu) February 22, 2024
మెగా డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్
ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల సహా ఇతర నేతలను ఆంధ్రరత్న భవన్‌లోనే నిర్బంధం
పోలీసుల వైఖరిని నిరసిస్తూ వైఎస్ షర్మిల, ఇతర నేతల ఆందోళన pic.twitter.com/1GiFcB3C4R