విదేశీ పర్యటనకు వెళ్లి సీఎం జగన్‌.. తిరిగి వచ్చేది ఎప్పుడంటే?

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, లోక్‌సభకు ఏకకాలంలో ఎన్నికలు ముగిసిన నాలుగు రోజుల తర్వాత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కుటుంబ సమేతంగా శుక్రవారం రాత్రి విదేశీ పర్యటనకు బయలుదేరారు.

By అంజి  Published on  18 May 2024 10:03 AM IST
Andhra Pradesh, CM Jagan Mohan Reddy, foreign tour

విదేశీ పర్యటనకు వెళ్లి సీఎం జగన్‌.. తిరిగి వచ్చేది ఎప్పుడంటే?

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, లోక్‌సభకు ఏకకాలంలో ఎన్నికలు ముగిసిన నాలుగు రోజుల తర్వాత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సమేతంగా శుక్రవారం రాత్రి విదేశీ పర్యటనకు బయలుదేరారు. గన్నవరం విమానాశ్రయంలో ఆయనకు మంత్రులు జోగి రమేష్, కొట్టు సత్యనారాయణ, ఎంపీ నందిగామ సురేష్, ప్రభుత్వ విప్‌లు సీహెచ్. భాస్కర్ రెడ్డి, ఎస్.ఉదయభాను, ఎమ్మెల్సీలు టి.రఘురామ్, ఎం.అరుణ్ కుమార్, ఎమ్మెల్యే ఎం.విష్ణు సెండ్‌ఆఫ్‌ ఇచ్చారు.

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సిపి) చీఫ్ వైస్ జగన్‌ పిటీషన్‌ను అనుసరించి సిబిఐ కేసుల ప్రత్యేక కోర్టు తన కుటుంబ సభ్యులతో కలిసి మే 17 నుండి జూన్ 1 వరకు యుకెలో పర్యటించడానికి మంగళవారం అనుమతి మంజూరు చేసింది. జూన్ 4న ఓట్ల లెక్కింపునకు మూడు రోజుల ముందు జూన్ 1న ఆయన ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి రానున్నారు. సీఎం జగన్‌ వరుసగా రెండో సారి అధికారం చేపట్టాలనుకుంటున్నారు. ఇటీవల ఐప్యాక్ట్‌ టీమ్‌ని కలిసిన సీఎం జగన్‌.. ఈ సారి జరిగిన ఎన్నికల్లో గెలిచేది మనమే అంటూ ధీమా వ్యక్తం చేశారు.

Next Story