విద్యలో అంతర్జాతీయ ప్రమాణాలుండాలి: సీఎం జగన్
ఉన్నత విద్యారంగంలో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది.
By Srikanth Gundamalla Published on 16 Feb 2024 2:40 PM ISTవిద్యలో అంతర్జాతీయ ప్రమాణాలుండాలి: సీఎం జగన్
ఉన్నత విద్యారంగంలో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. ప్రుఖ విద్యా పోర్టల్ ఎడ్‌క్స్‌తో శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీ విద్యాశాఖ ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఎంవోయూకి సీఎం జగన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా మాట్లాడిన సీఎం జగన్.. మన పిల్లలు ప్రపంచ స్థాయిలో పోటీ పడలాని అన్నారు. అప్పుడే భవిష్యత్ మారుతుందని చెప్పారు.
పిల్లలకు నాణ్యమైన విద్య అందించడం అనేది హక్కుగా చెప్పారు ఏపీ సీఎం జగన్. ఇది ఒక కొత్త నినాదాం అన్నారు. నాణ్యమైన విద్యను పిల్లలకు అందించకపోతే మనం వెనుకబడిపోతామన్నారు. ఇక అప్పుడు మిగతావారంతా మనల్ని దాటుకుని ముందుకు వెళ్లిపోతారని చెప్పారు. దేశంలో ఉన్నవారితో కాకుండా.. ప్రపంచంతో పోటీ పడాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ఉన్న పిల్లలు మెరుగైన ఉద్యోగాలు సాధించాలని సీఎం జగన్ అన్నారు. మంచి జీతాలు సంపాదించి.. కుటుంబాన్ని బాగా చూసుకోవాలని తద్వారా రాష్ట్రంలో పేదలు లేకుండా అవ్వాలని సీఎం జగన్ అన్నారు. నాణ్యమైన విద్య అందించడం ద్వారానే ఇవన్నీ సాధ్యమవుతాయని సీఎం అన్నారు.
విద్య అంతర్జాతీయ ప్రమాణాలతో పిల్లలు అందించాలని సీఎం జగన్ అన్నారు. దాంతో వారికి మెరుగైన అవకాశాలు వస్తాయని చెప్పారు. ఇది ఒక ఆరంభం మాత్రమే అనీ.. ఫలాలు అందడానికి కొంత సమయం పడుతుందని వ్యాక్యానించారు. ప్రతి అడుగులో వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధి, అంకిత భావం చూపిస్తోందని అన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టామని సీఎం జగన్ చెప్పారు. గ్లోబస్ సిటిజన్ కావాలంటే మన భాషలో మార్పులు రావాలని.. ప్రపంచ స్థాయితో పోటీపడాలని సీఎం జగన్ అన్నారు. అందుకే ఇంగ్లీషు మీడియా నుంచి నాడు -నేడు, అమ్మ ఒడి, గోరుముద్దతో మన ప్రయాణం ప్రారంభం అయ్యిందని అన్నారు. ఇక్కడితో ఆగిపోదనీ.. వచ్చే పదేళ్లలో టెన్త్ విద్యార్థి ఐబీ విద్యాబోధన అందించే దిశగా అడుగులు వేస్తున్నామని సీఎం జగన్ అన్నారు.