తుంగభద్ర డ్యాం ఘటనతో అధికారులను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు
కర్ణాటకలో తుంగభద్ర డ్యామ్ గేటు శనివారం రాత్రి తర్వాత కొట్టకుపోయిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla
తుంగభద్ర డ్యాం ఘటనతో అధికారులను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు
కర్ణాటకలో తుంగభద్ర డ్యామ్ గేటు శనివారం రాత్రి తర్వాత కొట్టకుపోయిన విషయం తెలిసిందే. ఆ గేటు నుంచి వరద నీరు బయటకు వదులతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆంద్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఈ సంఘటనపై స్పందించారు. కర్ణాటకలో తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకుపోవడంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు.
ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు. గేటు కొట్టుకుపోయి అక్కడి నుంచి వరద నీరు వస్తున్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు చంద్రబాబు. ఈ మేరకు అధికారులు అలర్ట్ గా ఉండానలన్నారు. నిర్వహణ లేని పాత గేటు కొట్టుకుపోయిందని సీఎం చంద్రబాబుకి సాయి ప్రసాద్ వివరించారు. తక్షణం ప్రాజెక్టు వద్దకు డిజైన్ టీమ్‌ను పంపాలని సీఎం చంద్రబాబు సూచించారు. జలాశయంలో 6 మీటర్ల ఎత్తు వరకు నీరు ఉందని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. స్టాప్‌లాక్ అరేంజ్‌మెంట్ ద్వారా నీరు వృథా కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.మరోవైపు తుంగభద్ర డ్యామ్ అధికారులతో మాట్లాడాలని మంత్రి పయ్యావుల కేశవ్‌ను చంద్రబాబు ఆదేశించారు. తాత్కాలిక గేటు ఏర్పాటుపై డ్యామ్ అధికారులతో మాట్లాడాలన్నారు. తగిన సహకారం అందించాలని పయ్యావులకు సూచించారు.
సీఎం ఆదేశాలతో ఘటనాస్థలానికి ఇంజినీర్ల బృందం వెళ్లిందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్లను ఆదేశించినట్లు చెప్పారు. ముఖ్యంగా.. కౌతాలం, కోస్గి, మంత్రాలయం, నందవరం ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.