విధ్వంస పాలనను గుర్తులను అలానే ఉంచుతాం: సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు సంచలన కామెంట్స్ చేశారు. గత ప్రభుత్వ పాలనపై విమర్శలు చేశారు.
By Srikanth Gundamalla Published on 15 Jun 2024 7:18 PM ISTవిధ్వంస పాలనను గుర్తులను అలానే ఉంచుతాం: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు బాధ్యతలను స్వీకరించారు. తొలిరోజే ఆయన మెగా డీఎస్సీతో పాటు పలు ఫైళ్లపై సంతకాలు చేశారు. ఇక చంద్రబాబు సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి టీడీపీ కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సంచలన కామెంట్స్ చేశారు. గత ప్రభుత్వ పాలనపై విమర్శలు చేశారు. వైసీపీ ఎంత వేధింపులకు గురిచేసిందో గుర్తు చేశారు. విధ్వంస పాలన సాగించిందన్నారు. వారి విధ్వంస పాలన గుర్తుగా ప్రజా వేదిక నిలిచిపోతుందని అన్నారు. దాన్ని అలాగే ఉంచుతామనీ.. శిథిలాలు తొలగించబోము అని సీఎం చంద్రబాబు చెప్పారు. గతంలో టీడీపీ కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడి చేసిన విషయం తెలిసిందే.
త్వరలోనే ఏపీ అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. తేదీలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. పోలవరం సందర్శనతోనే తన క్షేత్రస్థాయి పర్యటనలు మొదలు అవుతాయని చంద్రబాబు తెలిపారు. ఇక ప్రజల నుంచి వినతులు స్వీకరించే కార్యక్రమం.. సచివాలయంలో ఏర్పాటు చేస్తే ఎలాం ఉటుందనే ఆలోచనలు చేస్తున్నారు చంద్రబాబు వెల్లడించారు. సచివాలయానికి రాకపోకల నిమిత్తం రవాణా సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఇతర సౌకర్యాలు కూడా అందుబాటులోకి తెస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. తనకు.. ప్రజలకు మధ్య అడ్డుగోడలు ఉండటానికి వీల్లేదని వ్యాఖ్యానించారు. ప్రజల నుంచి వచ్చే సమస్యల విజ్ఞప్లుల స్వీకరణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే సమస్యలను పరిష్కరించేందుకు నిర్దిష్ట కాల పరిమితి పెట్టుకుని పనిచేసేలా ఆదేశాలు ఇవ్వనున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు.