మంచి నిర్ణయాలతోనే భవిష్యత్‌ తరాలకు మేలు: సీఎం చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు వెలగపూడి సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సదస్సులో పాల్గొన్నారు.

By Srikanth Gundamalla  Published on  5 Aug 2024 6:45 AM GMT
andhra pradesh, cm chandrababu, collectors meeting ,

మంచి నిర్ణయాలతోనే భవిష్యత్‌ తరాలకు మేలు: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెలగపూడి సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుతూ పలు కీలక కామెంట్స్ చేశారు. అలాగే గత వైసీపీ ప్రభుత్వంపైనా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష్యాలకు అనుగుణంగా అధికారులంతా కలిసి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు సూచించారు.

గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారని సీఎం చంద్రబాబు అన్నారు. వైసీపీ విధ్వంస పాలనలో అందరూ నష్టపోయారని అన్నారు. అయితే.. మనం తీసుకునే నిర్ణయాల వల్ల వ్యవస్థలే మారే పరిస్థితి ఉంటుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మంచి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్‌ తరాలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. అందరం కష్టపడి పనిచేస్తే 2047 నాటికి ప్రపంచంలోనే మనం నెంబర్‌ స్థానంలో ఉంటామని సీఎం చంద్రబాబు కలెక్టర్లతో అన్నారు. అయితే.. తాజాగా జరుగుతోన్న కలెక్టర్ల సదస్సు చరిత్ర తిరగరాయబోతుందని వ్యాఖ్యానించారు. ప్రజా వేదికలో ఆనాటి సీఎం కలెక్టర్ల సదస్సు పెట్టి కూలగొట్టేశారని అన్నారు. విధ్వంసంతో పాటు పనిచేసే అధికారులను కూడా పక్కన పెట్టి అన్యాయం చేశారని మండిపడ్డారు. బ్లాక్‌ మెయిల్‌చేసి దుష్ట రాజకీయాలకు పాల్పడ్డారని సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. బ్రాండ్ ఏపీని దెబ్బ తీసేలా గత ఐదేళ్ల పాలన కొనసాగిందని అన్నారు. ఒకప్పుడు ఆంధ్రా అదికారులంటే ఢిల్లీలో గౌరవం ఉండేదనీ.. కానీ ఇప్పుడు చులకన భావం కలిగే పరిస్థితులను తీసుకొచ్చారని అన్నారు. దీనంతటికీ కారణంగా గత వైసీపీ ప్రభుత్వమే అని సీఎం చంద్రబాబు అన్నారు.

Next Story