చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం, 8 మంది దుర్మరణం

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు లారీలను బస్సు ఢీకొట్టింది.

By Srikanth Gundamalla  Published on  13 Sept 2024 4:36 PM IST
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం, 8 మంది దుర్మరణం

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు లారీలను బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మంది వరకు గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించారు.

చిత్తూరు జిల్లాలోని మొగిలిఘాట్‌ వద్ద శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘోర ప్రమాదం జరిగింది. బస్సు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మరోలారీ కూడా ఉందని తెలిసింది. ఇక రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, ఇతర వాహనదారులు పోలీసులు, అంబులెన్స్‌కు సమాచారం అందించారు. దాంతో.. వెంటనే సహాయక సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని బస్సులో నుంచి బయటకు తీసి.. ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఎనిమిది మంది మృతదేహాలను పోలీసులు వెలికి తీశారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి.. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. కాగా.. ఘాట్‌ రోడ్డులో ప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. వాహనాలను క్లియర్ చేసేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

Next Story