LIVE UPDATES: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది.
By అంజిLive Updates
- 4 Jun 2024 9:37 AM IST
ఆళ్లగడ్డలో టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ ముందంజలో ఉన్నారు.
జమ్మలమడుగు టీడీపీ అభ్యర్థి చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
తాడికొండలో టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రవణ్‌కుమార్ ముందంజ.
తాడేపల్లిగూడెంలో జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ఆధిక్యం
పాలకొల్లులో టీడీపీ అభ్యర్థి నిమ్మల రామానాయుడు ఆధిక్యం
సంతనూతలపాడు టీడీపీ అభ్యర్థి విజయ్‌కుమార్ ముందంజ
గురజాలలో 1311 ఓట్ల ఆధిక్యంలో టీడీపీ అభ్యర్థి యరపతినేని
- 4 Jun 2024 9:36 AM IST
మాచర్లలో వైసీపీ అభ్యర్థి, పిన్నెలి రామకృష్ణారెడ్డిపై టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి 1000 ఓట్ల ఆధిక్యం
- 4 Jun 2024 9:23 AM IST
హిందూపురంలో బాలకృష్ణ ఆధిక్యంలో ఉన్నారు. మొదటి రౌండ్‌లో 1,880 ఓట్ల ఆధిక్యంలో బాలకృష్ణ ఉన్నారు.
- 4 Jun 2024 9:18 AM IST
మంగళగిరిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ ముందంజలో ఉన్నారు
అమలాపురంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనంద్‌బాబు ఆధిక్యంలో ఉన్నారు
మచిలీపట్నంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర 4,300 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు
జగ్గంపేటలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జ్యోస్తుల నెహ్రూ 3,550 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు
రాజమండ్రి సిటీలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ 3,214 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు
వైఎస్సార్‌సీపీ చీపురుపల్లె ఎమ్మెల్యే అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఆధిక్యంలో ఉన్నారు
వైఎస్సార్‌సీపీ గజపతినగరం ఎమ్మెల్యే అభ్యర్థి బొత్స అప్పల నరసయ్య ముందంజలో ఉన్నారు
వైఎస్సార్‌సీపీ కావలి ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ముందంజలో ఉన్నారు
- 4 Jun 2024 9:14 AM IST
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పోలీసులు సోషల్ మీడియాపై ప్రత్యేక దృష్టి సారించారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా హెచ్చరించారు.
- 4 Jun 2024 9:09 AM IST
బొబ్బిలిలో టీడీపీ అభ్యర్థి బేబీనాయన ముందంజ
శృంగవరపుకోటలో టీడీపీ అభ్యర్థి లలితకుమారి ఆధిక్యం
- 4 Jun 2024 9:00 AM IST
పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌లో మంత్రి రోజా నగరిలో వెనకంజలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి గాలి భాను ప్రకాశ్ లీడింగులో ఉన్నారు. మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ లీడింగులో కొనసాగుతున్నారు. అక్కడ వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పోటీ చేస్తున్నారు.
- 4 Jun 2024 8:57 AM IST
గుంటూరు జిల్లా మంగళగిరిలో టీడీపీ నేత నారా లోకేష్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
తెనాలిలో జనసేన అభ్యర్థి నాదెంట్ల మనోహర్, పూతలపట్టులో టీడీపీ అభ్యర్థి మురళీమోహన్ ఆధిక్యంలో ఉన్నారు.
- 4 Jun 2024 8:53 AM IST
వైఎస్సార్‌సీపీ చీపురుపల్లె ఎమ్మెల్యే అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఆధిక్యంలో ఉన్నారు
వైఎస్సార్‌సీపీ గజపతినగరం ఎమ్మెల్యే అభ్యర్థి బొత్స అప్పల నరసయ్య ముందంజలో ఉన్నారు
వైఎస్సార్‌సీపీ కావలి ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ముందంజలో ఉన్నారు
పిఠాపురం అసెంబ్లీలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముందంజలో ఉన్నారు.
- 4 Jun 2024 8:30 AM IST
తొలి రౌండ్ పోస్టల్ బ్యాలెట్‌లో టీడీపీ అధినేత, కుప్పం ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రబాబు నాయుడు 1,549 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు.
తొలి రౌండ్ పోస్టల్ బ్యాలెట్‌లో రాజమండ్రి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుచ్చయ్య చౌదరి 910 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు.
తొలి రౌండ్ పోస్టల్ బ్యాలెట్‌లో నెల్లూరు నగర టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పి.నారాయణ ముందంజలో ఉన్నారు.