అమరావతి: రాష్ట్రంలోని 10వ తరగతి విద్యార్థులకు అలర్ట్.. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ఫలితాలు నిన్న సాయంత్రం విడుదల అయ్యాయి. ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఎవరైతే రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారో వారు వారి ఫలితాలను ఇప్పుడు తెలుసుకోవచ్చు. గత నెలలో అధికారులు టెన్త్ ఫలితాలను విడుదల చేశారు. ఆ తర్వాత విద్యార్థుల నుంచి రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోసం దరఖాస్తులు స్వీకరించారు.
అలా మొత్తం 66,421 జవాబు పత్రాలు రీ వెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం రాగా.. వాటిలో 47,484 పత్రాలకు సంబంధించిన ఫలితాలు విడుదలయ్యాయని ఏపీ ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డా.కేవీ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. మిగిలిన ఫలితాలను త్వరలోనే రిలీజ్ చేస్తామని వెల్లడించారు. ఫలితాల కోసం విద్యార్థులు సంబంధిత హెడ్ మాస్టర్లను సంప్రదించాలని సూచించారు. లేదంటే విద్యార్థులు తమ స్కూల్ కోడ్, పాస్‌వర్డ్ నమోదు చేసి ఫలితాలను పొందవచ్చన్నారు. రీ-వెరిఫికేషన్ ఫలితాల కోసం https://bse.ap.gov.in/sscrvrc/login లో లాగ్ అవ్వండి.