విడాకుల కోసం.. గర్భిణికి హెచ్‌ఐవీ సోకిన రక్తాన్ని ఎక్కించిన భర్త.. ఏపీలో ఘటన

Andhra man injects HIV-infected blood to pregnant wife. ఆంధ్రప్రదేశ్‌లోని ఓ వ్యక్తి దారుణానికి ఓడిగట్టాడు. భార్య తన నుంచి విడిపించుకునేందుకు

By అంజి
Published on : 18 Dec 2022 3:46 PM IST

విడాకుల కోసం.. గర్భిణికి హెచ్‌ఐవీ సోకిన రక్తాన్ని ఎక్కించిన భర్త.. ఏపీలో ఘటన

ఆంధ్రప్రదేశ్‌లోని ఓ వ్యక్తి దారుణానికి ఓడిగట్టాడు. భార్య తన నుంచి విడిపించుకునేందుకు కుట్ర పన్నాడు. తన గర్భిణి అయిన భార్యకు విడాకులు ఇచ్చేందుకు హెచ్‌ఐవీ సోకిన రక్తాన్ని ఇంజెక్ట్ చేయించాడు. ఓ డాక్టర్‌ సహాయంతో తన భర్త ఎం. చరణ్‌ హెచ్‌ఐవీ సోకిన రక్తాన్ని తనకు ఇంజెక్ట్ చేయించాని భార్య ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు చరణ్‌ను అరెస్ట్ చేశారు. చరణ్ తనకు విడాకులు ఇచ్చేందుకు తగిన సాకు వెతుకుతున్నాడని, పక్కా ప్లాన్‌ ప్రకారం తనను ఓ దొంగ వద్దకు తీసుకెళ్లాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది.

ప్రెగ్నెన్సీ సమయంలో మంచి ఆరోగ్యం ఉండేందుకు ఈ ఇంజక్షన్ వేస్తున్నామని చెప్పారని బాధితురాలు తెలిపింది. ఆసుపత్రిలో ఆరోగ్య పరీక్షల సమయంలో తనకు హెచ్‌ఐవీ పాజిటివ్ అని తెలిసి షాక్ అయ్యానని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. తన భర్త కట్నం కోసం వేధిస్తున్నాడని, మగబిడ్డను కనాలని కూడా ఒత్తిడి చేస్తున్నాడని బాధితురాలు ఆరోపించింది. ఈ దంపతులకు ఒక కుమార్తె ఉంది. భర్త చరణ్‌ను ప్రశ్నిస్తున్నామని, బాధితురాలికి వైద్య పరీక్షల అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

Next Story