ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి రైల్వేస్టేషన్‌లో ఒక ప్రయాణికుడు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ఎక్కేందుకు ప్రయత్నించగా ప్లాట్‌ఫారమ్‌కు రైలుకు మధ్య ఇరుక్కుపోయాడు. అయితే ఘోర ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నాడు. రైలు బయలుదేరడానికి సిద్ధమవుతున్న సమయంలో ఈ సంఘటనచోటు చేసుకుంది. ప్రాణాపాయ స్థితిలో చిక్కుకున్న బాధితుడిని రైల్వే అధికారులు రక్షించారు. అతి కష్టం మీద ప్రయాణికుడిని ప్రాణాలతో రక్షించారు. అతన్ని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి అధికారులు ప్లాట్‌ఫారమ్‌లోని కాంక్రీట్ ఫ్లోర్‌ను బద్దలు కొట్టాల్సి వచ్చింది. గాయపడిన ప్రయాణికుడిని అత్యవసర వైద్య సహాయం కోసం వెంటనే ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు.
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఎక్కుతుండగా కాళ్లు జారి ఒక వ్యక్తి ట్రైన్‌కి, ఫ్లాట్ ఫారం మధ్య ఇరుక్కుపోయాడు. దీంతో ట్రైన్ నిలిపివేసి ఆ వ్యక్తిని బయటికి తీశారు. డ్రిల్లర్లతో ప్లాట్‌ఫారమ్ కొంత భాగాన్ని ధ్వంసం చేసి బయటకు తీశారు. అప్పటికే అతనికి తీవ్ర గాయాలయ్యాయి. బాధిత వ్యక్తిని పైలా రాజబాబుగా గుర్తించారు. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం తోటకూర పాలెంకు చెందిన రాజబాబు వృత్తిరీత్యా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో రాజబాబు చికిత్స తీసుకుంటూ ఉన్నాడు.