ఏపీలో రాత్రి క‌ర్ఫ్యూ పొడిగింపు

Andhra extends night curfew for two more weeks.ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో రాత్రి క‌ర్ఫ్యూని ప్ర‌భుత్వం పొడిగించింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Feb 2022 11:04 AM GMT
ఏపీలో రాత్రి క‌ర్ఫ్యూ పొడిగింపు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో రాత్రి క‌ర్ఫ్యూని ప్ర‌భుత్వం పొడిగించింది. ఫిబ్ర‌వ‌రి 14 వ‌ర‌కు నైట్ కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు మంగ‌ళ‌వారం ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో క‌రోనా కేసులు పెరుగుతుండ‌డంతో నైట్ క‌ర్ఫ్యూని విధించిన సంగ‌తి తెలిసిందే. జ‌వ‌న‌రి 31తో ప్ర‌భుత్వం విధించిన నైట్ క‌ర్ఫ్యూ గ‌డువు ముగియడంతో మ‌రోసారి క‌ర్ఫ్యూని ప్ర‌భుత్వం పొడిగించింది. రాత్రి 11 గంట‌ల నుంచి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ అమ‌ల్లో ఉంటుంద‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు.

ఏపీలో రోజు 10 వేలకు చేరువలో కేసులు వ‌స్తున్నాయి. నిన్న కొత్త కేసులు భారీగా తగ్గినా.. మరణాల‌ సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 5,879 కొత్త పాజిటివ్ కేసులు నిర్ధారణ అయిన‌ట్లు సోమ‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 22,76,370కి చేరింది. తొమ్మిది మంది ఈ మహమ్మారి బారిన పడి మరణించారు. వీటితో కలిపి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 22, 76,370 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 21,51,238 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా కార‌ణంగా రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 14,615 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 1,10,517 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఇక రాష్ట్రంలో ప్రతిఒక్కరూ మాస్కు ధరించాలి. దీనిని అతిక్రమిస్తే రూ.100 జరిమానా విధిస్తారు. వివాహాలు, శుభకార్యాలు, మతపరమైన కార్యక్రమాలను బహిరంగ ప్రదేశాల్లో అయితే గరిష్టంగా 200 మంది, ఇన్‌డోర్‌లో 100 మందికి మాత్రమే అనుమతి ఉంది. థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ కొనసాగనుంది. ప్రజా రవాణా వాహనాల్లో సిబ్బందితో పాటు, ప్రయాణికులు మాస్క్‌లు ధరించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Next Story