ఏపీలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో.. అనంత‌పురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు రాప్తాడు మండల కేంద్రంలోని మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడారు. ప్రభుత్వం అందజేసిన యూనిఫామ్, బ్యాగులు ఎలా ఉన్నాయ్ అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం.. బాగా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. తర్వాత విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.


సామ్రాట్

Next Story